NTR
NTR : ఎన్టీఆర్ గొప్ప యాక్టర్ మాత్రమే కాదు మంచి వక్త. స్టేజీ మీద మైక్ అందుకొని మాట్లాడితే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎక్కడి వరకు మాట్లాడాలో పక్కాగా తెలిసిన వ్యక్తి. అలాంటి ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాత ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరు అంటూ ఘాటు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అసలు తారక్ ఎందుకు ఇలా మాట్లాడారు, ఆయన మాటల వెనక ఆంతర్యం ఏంటో అని చర్చ నడుస్తుంది.
ఎన్టీఆర్ అంటే డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, ఇంటెన్సిటీ గుర్తుకువస్తుంది. ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మాట కూడా అంతే అందంగా వినిపిస్తుంటుంది అంటారు ఫ్యాన్స్. విషయం ఏదైనా సూటిగా, సుత్తిలేకుండా తన మార్క్ హ్యూమర్‌తో మాట్లాడేస్తుంటారు. ప్రీ రిలీజ్ అయినా మూవీ ఇంటర్వ్యూ అయినా ఇలానే కనిపిస్తుంటారు. అలాంటి తారక్ మొదటిసారి ఓ సినిమా స్టేజీ మీద సీరియస్ అయ్యారు. ఇది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అవుతోంది.
బాలీవుడ్‌లోకి ఫస్ట్ టైమ్ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ వార్ 2తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ మాట్లాడిన మాటలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాత నందమూరి తారకరామారావు ఆశీస్సులు ఉన్నత కాలం తనను ఎవరూ ఆపలేరు అంటూ ఎన్టీఆర్ మాట్లాడాడు. అసలు ఇప్పుడు సడన్‌గా తనను ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ ఎందుకు అంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు అసలేం జరిగింది, ఈ మాట వెనక జరిగిన సంఘటన ఏంటనే డిస్కషన్ నడుస్తోంది.
ఎన్టీఆర్ కెరీర్ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టారా, లేదంటే వార్ 2 హిందీ డబ్బింగ్ సినిమా అని తక్కువ చేసి చూస్తున్నారా? ఆ సినిమాకు బ్రేక్‌లు వేసే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా, ఎందుకు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ అంత సీరియస్‌గా కనిపించారు? అంత సీరియస్ వ్యాఖ్యలు చేశారనే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎవరెన్ని కామెంట్స్ చేసినా వార్ 2 తెలుగు సినిమానే అని, బొమ్మ అదిరిపోయిందంటూ రెండు చేతులతో కాలర్‌ను పైకి ఎత్తారు. దీంతో ఈ సంఘటన ఏదో జరిగిందనే అనుమానాలను మరింత పెంచింది. గతంలో అనేకమార్లు తాతయ్యని తలుచుకున్నారు కానీ మొదటిసారి నందమూరి వారసత్వం తాతయ్య పేరు గుర్తుచేసుకొని తనని ఎవ్వరూ ఆపలేరంటూ వ్యాఖ్యానించడం వెనక అసలు కారణం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొత్త చర్చ మొదలుపెట్టారు.
Also Read : NTR : నా అభిమాని ప్రాణం కోల్పోయాడు.. అప్పట్నుంచి కొంచెం దూరంగా ఉన్నాను..
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి..