డైలమాలో ట్రంప్ : కరోనా వ్యాక్సిన్ వస్తే..ముందు వేసుకోవాలా?ఆఖరున వేసుకోవాలా

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పిట్లో నెడుతోంది. ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. వెలుగులోకి వచ్చే నెలలు గడుస్తున్నా ఈ వైరస్ కు వ్యాక్సిన్ మాత్రం లేదు. అగ్రరాజ్యం అమెరికాలో అయితే ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది.

కరోనాకు పూర్తిగా చెక్ పెట్టగలిగే వ్యాక్సిన్ మరో 5-6 నెలల్లో వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నట్లుగా… ప్రజలు కోరుకున్నట్లుగా, మొదటి లేదా చివరిగా కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తాను అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నానని- కరోనా వ్యాక్సిన్ తీసుకోబోయే మొదటి వ్యక్తిని తానా,కాదా అని ట్రంప్ అన్నారు.

ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ… కరోనా వ్యాక్సిన్ తీసుకోబోయే మొదటి వ్యక్తి తానే అయితే..ట్రంప్ చాలా స్వార్థపరుడు అని కొందరు అంటారు. ఇంకొందరు ‘హే, ఇది చాలా ధైర్యమైన పని’ అని చెబుతారు అని ట్రంప్ అన్నారు. మొదటగా లేదా చివరిగా వ్యాక్సిన్ తీసుకుంటే తాను ఎలాగైనా ఓడిపోతానని ట్రంప్ చెప్పాడు. మొదటి సందర్భంలో, ట్రంప్ స్వార్థపరుడని ప్రజలు అనుకుంటారు మరియు రెండవ సందర్భంలో ప్రజలు వ్యాక్సిన్ ప్రభావాన్ని ఆయన విశ్వసించరని చెబుతారు అని ట్రంప్ అన్నారు.

వారు నన్ను కోరుకుంటే మరియు అది సరైనదని అనుకుంటే..నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. మొదట వ్యాక్సిన్ తీసుకుంటాను లేదా నేను చివరిగా తీసుకుంటానుఅని ట్రంప్ అన్నారు. నేను మొదట తీసుకుంటే, నేను మరో దానిని కోల్పోతాను అని మీకు తెలుసు. నేను తీసుకోకపోతే వారు ‘అతను ప్రోగ్రామ్‌ను నమ్మరు అని చెబుతారు అని ట్రంప్ అన్నారు.

కరోనాతో సతమతమవుతున్న అమెరికా వ్యాక్సిన్‌ కోసం ఆతృతతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి ముందే కంపెనీలతో అమెరికా ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా 60 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్‌ కోసం ట్రంప్‌ పాలకవర్గం ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ ఎస్‌ఈలతో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

వ్యాక్సిన్‌ డోసుల కోసం చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమైనదని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్‌ కోసం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఫైజర్‌కు అమెరికా ప్రభుత్వం 200 కోట్ల డాలర్లు చెల్లించనుంది. ఈ మేరకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి తగిన అనుమతి అందుకుంటే డిసెంబరులో 10 కోట్ల డోసులను ఫైజర్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో 50 కోట్ల డోసులు అమెరికా కొనుగోలు చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు