Drunk Woman Ruckus : మందు తాగితే మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తున్నారు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. తాజాగా ఓ మహిళ మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్ చేసింది. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ప్యాంటు విప్పేసింది. అంతేకాదు కనిపించిన వారిని బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన మహారాష్ట్ర థానెలోని మీరా రోడ్డులో జరిగింది. శుక్రవారం రాత్రి కొంతమంది పార్టీ చేసుకున్నారు. పీకల దాకా మద్యం తాగారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. మగవాళ్లతో పోటీపడుతూ మందు కొట్టారు. ఈ క్రమంలో ఓ మహిళకు కిక్కు బాగా ఎక్కేసిందో ఏమో.. కల్లు తాగిన కోతిలా నానా గోల చేసింది. నడిరోడ్డుపై నానా రచ్చ చేసింది. అంతా చూస్తుండగానే ప్యాంటు విప్పేసింది. అంతేనా.. రోడ్డుపై కనిపించిన వారందరిని బూతులు తిట్టింది. వారి మీద దాడికి వెళ్లింది. ఆమెను కంట్రోల్ చేయలేక స్నేహితులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత వారించినా ఆమె అస్సలు ఊరుకోలేదు.
మద్యం మత్తులో ఆ మహిళ చేసిన వీరంగాన్ని ఎవరో వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మద్యం మత్తులో ఆ మహిళ చేసిన వీరంగాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ మహిళ ఇలా చేయడం ఏంటని నివ్వెరపోతున్నారు. మహిళ అయి ఉండి మద్యం తాగడం ఏంటి? నడిరోడ్డుపై ఇలా రచ్చ చేయడం ఏంటి? అని అంతా అవాక్కవుతున్నారు. పద్దతిగా ఉండాల్సిన అమ్మాయిలు.. ఇలా తయ్యారేంటి రా బాబూ.. అని తల పట్టుకుంటున్నారు.
#DENUDE_being_DRUNK: What went wrong with the policing in #MiraRoad? Hundreds of residents have to witness such chaos of #sozzled customers of a lounge almost every night. Here, apparently, a woman high on booze opened dictionary of abuses after stripping down her pant on road!! pic.twitter.com/NsjnKAuuGl
— Diwakar Sharma ? (@DiwakarSharmaa) December 16, 2022
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కాగా, మీరా రోడ్డులో రాత్రి అయ్యిందంటే చాలు ఇలాంటి న్యూసెన్స్ లు నిత్యకృత్యంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. పీకల దాకా తాగడం, రోడ్డుపై రచ్చ చేయడం.. రోజూ జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా పోలీసులు స్పందించి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.