×
Ad

తనకంటే బ్యూటీఫుల్‌గా ఉన్నవారిని నీటి తొట్టెలో ముంచి చంపేస్తున్న యువతి.. నలుగురు చిన్నారులను ఇలాగే దారుణంగా..

అన్ని హత్యలనూ ఒకే విధంగా చేసింది. అతి తక్కువ లోతు ఉన్న నీటిలో చిన్నారులు మృతిచెందారు.

Haryana woman: తనకంటే బ్యూటీఫుల్‌గా ఉన్నారన్న అసూయతో ముగ్గురు బాలికలను నీటి తొట్టెలో పడేసి చంపేసింది ఓ యువతి. అలాగే, ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి తన సొంత కొడుకును కూడా హత్య చేసింది.

 

హరియాణాలోని పానీపట్‌లో బుధవారం ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నౌల్థా గ్రామంలో ఇటీవల 6 ఏళ్ల చిన్నారి మృతి కేసును విచారించిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి వివరాలు తెలిపారు.

Also Read: నిరుద్యోగులు గెట్‌ రెడీ.. త్వరలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. ఫుల్ డీటెయిల్స్‌

ఆ మహిళ తనకంటే అందంగా ఉన్నారని భావించిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటూ చంపుకుంటూ వస్తోంది. 2023లో సోనిపట్‌లోని బొహాద్ గ్రామంలో తన తమ్ముడి కూతురిని నీటి తొట్టెలో ముంచి చంపిందని, తనపై అనుమానం రాకుండా తన కుమారుడిని కూడా ముంచి చంపిందని దర్యాప్తులో తెలిసింది. ఆ తర్వాతి హత్యలు ఆ యువతి తల్లి ఇంట్లో జరిగాయి.

తాజాగా నౌల్థా గ్రామంలోని పెళ్లిలో ఆమె తన మేనకోడలు విద్యిని హత్య చేసింది. అన్ని హత్యలనూ ఒకే విధంగా చేసింది. అతి తక్కువ లోతు ఉన్న నీటిలో చిన్నారులు మృతిచెందారు. ఒక కేసులో టబ్ లోతు ఒక అడుగు మాత్రమే. గతంలోనూ తన కుమారుడు సహా మరో ఇద్దరు చిన్నారులను తాను చంపేసినట్లు ఆ యువతి ఒప్పుకుంది. అనంతరం ఆ చిన్నారులు ప్రమాదంలో మృతి చెందారని నమ్మించేలా ప్రయత్నాలు చేసినట్లు చెప్పింది.