నిరుద్యోగులు గెట్ రెడీ.. త్వరలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. ఫుల్ డీటెయిల్స్
వైద్యారోగ్యశాఖలో 7,267 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు చెప్పింది.
Revanth Reddy
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, ప్రజాపాలన రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.
త్వరలోనే మరో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. మరోవైపు, వైద్యారోగ్యశాఖలో 7,267 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఈ శాఖలో 9,203 పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైద్యరంగంలో సాధించిన ప్రగతిపై సర్కారు విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు తెలిపింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించింది. ఇందులో కొత్తగా 163 రకాల చికిత్సలను చేర్చినట్లు వివరించింది. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను పెంచుతున్నామని చెప్పింది.
తెలంగాణలో కొత్తగా 9 ప్రభుత్వ వైద్య కాలేజీలను ఏర్పాటు చేశామని, దీంతో అదనంగా 450 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని పేర్కొంది. 16 కొత్త నర్సింగ్ కళాశాలల వల్ల తెలంగాణలో వాటి సంఖ్య 37కు చేరిందని చెప్పింది. రెండేళ్లలో 28 పారామెడికల్ కళాశాలలను సర్కారు ప్రారంభించినట్లు తెలిపింది.
త్వరలో ఈ పోస్టుల భర్తీ
- 1,623 స్పెషలిస్టు డాక్టర్లు
- 607 అసిస్టెంట్ ప్రొఫెసర్లు
- 48 డెంటల్ డాక్టర్లు
- 2,322 స్టాఫ్‌నర్స్‌లు
- 732 ఫార్మసిస్టులు
- 1,931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మహిళ)
- నాలుగు స్పీచ్ పాథాలజిస్టు
