Etela Rajender: గుళ్లకు వెళ్లి.. అమ్మ తోడు, అయ్య తోడు అనడం ఏంటీ?: స్పందించిన ఈటల
Etela Rajender: రేవంత్ రెడ్డి సవాలుపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
- T Venkateshwarlu
- Published On : April 22, 2023 / 06:28 PM IST
Etela Rajender
Etela Rajender: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేసిన అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. గుళ్లకు వెయ్యి.. అమ్మ తోడు, అయ్య తోడు అనడం ఏంటీ? అని నిలదీశారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని, ఆత్మసాక్షిగా మాట్లాడానని అన్నారు.
ప్రజలను ఉద్దేశించి తాను మాట్లాడానని, అంతేగానీ వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడలేదని ఈటల రాజేందర్ తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నాయన్న అంశంపై మాట్లాడానని చెప్పారు. రాజకీయ నాయకులు విశ్వాసం, ఆత్మసాక్షిగా మాట్లాడాలని చెప్పారు. వ్యక్తిగతంగా తాను ఎవరినీ కించపర్చలేదని, తగిన సమయంలో సమాధానం ఇస్తానని అన్నారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి నిధులు తీసుకున్నానన్న ఆరోపణలను ఖండించారు. ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని రేవంత్ సవాలు విసిరారు.
ప్రమాణం చేయడానికి ఈటల రాజేందర్ అక్కడకు రాలేదు. రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న వెంటనే ఈటల స్పందించడం గమనార్హం. అయితే, తాను చేసిన ఆరోపణలపై ఆయన మాట్లాడలేదు.
Revanth Reddy: భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్ రెడ్డి.. అమ్మవారిపై ప్రమాణం.. ఉత్కంఠ
