Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ ప‌ట్ట‌ణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ..

Gold And Silver Price : బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,100కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,380 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ ప‌ట్ట‌ణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,530 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380 వద్ద కొనసాగుతుంది.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,700 వద్దకు చేరగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.64,040కు చేరింది.

స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,000 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.75,500కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 2500 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.75,500 వద్ద కొనసాగుతోంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు