Cooker Coffee Seller
Coffee made in Cooker: సాధారణంగా ప్రెజర్ కుక్కర్ ను అన్నం, పప్పు, కూరగాయలు ఉడికించేందుకు ఉపయోగిస్తారు. ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ కుక్కర్ ను కాఫీ తయారు చేసేందుకు కూడా వాడొచ్చని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. కుక్కర్ లో కాఫీ తయారు చేయడం ఏమిటి? అనుకుంటున్నారా. ఈ స్టోరీ చదివేయండి మరి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన ఓ వృద్ధుడు కాఫీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వినియోగదారులను ఆకట్టుకునేందుకు తన కాఫీ రుచిని మెరుగుపర్చుకోవాలని భావించాడు. అనేక ఆలోచనల తరువాత… ఇలా ప్రెజర్ కుక్కర్ కాఫీ ఆలోచనతో వచ్చాడు.
కుక్కర్ లో కాఫీపొడి వేసి, నీరుపోసి దాన్ని పొయ్యి మీద ప్రెజర్ చేయగా వచ్చిన ఆవిరితో కాఫీ తయారు చేస్తే, మంచి సువాసనతో పాటు కాఫీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈతరహా పద్దతిని పెద్ద పెద్ద బ్రాండెడ్ కాఫీ షాపుల్లో వినియోగిస్తారు. కానీ అంత సెటప్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ ఆలోచన బాగుందని భావించిన ఈ వృద్ధుడు, ఇలా ప్రెజర్ కుక్కర్ లో కాఫీ తయారు చేసి అమ్ముతున్నాడు. అదికూడా ఒక సైకిల్ పై ఈ సెటప్ తయారు చేసుకున్నాడు ఈవృద్ధుడు. దీంతో ఎక్కడ జనసమూహాలు ఉంటే అక్కడకు వెళ్లి, కాఫీ అమ్ముతున్నాడు. కాఫీ తాగిన వారు సైతం టేస్ట్ అదిరిందంటు మెచ్చుకుంటున్నారు.
Also Read: Santa gives gifts to Autism Boy: ఆటిజం బాలుడిలో చెప్పలేని సంతోషాన్ని నింపిన “శాంటా”: మనసు చలించే ఘటన
విశాల్ అనే ఫుడ్ బ్లాగర్ ఈ వృద్ధుడి ఆలోచనను వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు, “ఒహ్ క్యా ఐడియా సర్ జీ” అంటూ కామెంట్ చేస్తున్నారు. మన ఇండియాలో ఐడియాలకు కొదవేలేదని కొందరు అంటుంటే, మనసుంటే మార్గం ఉంటుందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి “కుక్కర్ తో కాఫీ”… ఐడియా సూపర్ ఉందికదూ.
Also Read: Anil Kapoor turns 65: అనిల్ కపూర్ 65వ పుట్టినరోజు: శుభాకాంక్షలు తెలిపిన అన్న బోనీ కపూర్