Santa gives gifts to Autism Boy: ఆటిజం బాలుడిలో చెప్పలేని సంతోషాన్ని నింపిన “శాంటా”: మనసు చలించే ఘటన

మనసు చలించే ఘటన ఇది. ఆటిజంతో బాధపడుతున్న ఓ బాలుడికి, శాంటా క్లాజ్ సంతోషాన్ని పంచుతున్న దృశ్యం ఇప్పుడు అందరిని కట్టిపడేస్తుంది.

Santa gives gifts to Autism Boy: ఆటిజం బాలుడిలో చెప్పలేని సంతోషాన్ని నింపిన “శాంటా”: మనసు చలించే ఘటన

Autism Boy Happiness

Santa gives gifts to Autism Boy: మనసు చలించే ఘటన ఇది. ఆటిజంతో బాధపడుతున్న ఓ బాలుడికి, శాంటా క్లాజ్ సంతోషాన్ని పంచుతున్న దృశ్యం ఇప్పుడు అందరిని కట్టిపడేస్తుంది. వయసు, శరీరం పెరిగినా, మానసిక పరిపక్వత లేకపోవడమే ఆటిజం. అలాంటి ఆటిజంతో పెరిగిన ఒక బాలుడు… బహుమతులతో వచ్చిన శాంటా క్లాజ్ ను చూసి ఎగిరి గంతులేస్తున్న ఘటన ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అమెరికాలో జరిగిన ఈఘటన తాలూకు వీడియోను “నెక్స్ట్ డోర్” అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుడు పోస్ట్ చేసాడు. క్రిస్టమస్ ను ఆనందాల పండుగగా జరుపుకునే అమెరికా దేశస్తులు… క్రిస్టమస్ సమయంలో శాంటా క్లాజ్ చిన్నారుల కోరికలు తీర్చేందుకు బహుమతులతో వస్తాడంటూ కథలుగా చెప్పుకుంటారు. ఆ కథలు విన్న ఈ బాలుడు..తమ వీధిలోకి వచ్చిన శాంటా క్లాజ్ ను చూసి, సంతోషంతో ఎగిరి గంతులేసాడు.

 

View this post on Instagram

 

A post shared by Nextdoor (@nextdoor)

“యూపీఎస్” అనే కొరియర్ సంస్థ… క్రిస్టమస్ సంధర్భంగా తమ వినియోగదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, తమ కొరియర్ బోయ్ లను శాంటా వేషంలో వినియోగదారుల వద్దకు పంపించింది. అలా శాంటా వేషంలో ఈ బాలుడి దగ్గరకు వచ్చిన “యూపీఎస్” ప్రతినిధి ఆ బాలుడికి బహుమతులు ఇచ్చి సంతోషాన్ని నింపాడు. యూపీఎస్ వాహనంలో శాంటా క్లాజ్ వస్తున్నాడంటూ అక్కడి వారందరు.. వీధిలోకి వచ్చి నిలుచున్నారు. అప్పుడే ఎదురుగా వస్తున్న కొరియర్ వాహనాన్ని చూసిన బాలుడు ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. మాటల్లోని చెప్పలేని సంతోషాన్ని వ్యక్త పరుస్తున్న ఆ బాలుడుని చూసి అక్కడి స్థానికులు సైతం ఆనందపడ్డారు. స్వతాహాగానే ఆబాలుడు యూపీఎస్ కంపెనీకి అభిమాని కాగా, తనకు ఎంతో ఇష్టమైన యూపీఎస్ వాహనంలో శాంటా క్లాజ్ తనవద్దకు వచ్చాడంటూ మాటల్లో వర్ణించలేని సంతోషంతో సంబరపడిపోయారు.

ఈదృశ్యాన్ని కొందరు వీడియో తీసి సామాజికమాధ్యమాల్లో పోస్ట్ చేయగా… నెటిజన్లు స్పందించారు. ఇది హృదయం కరిగించే ఘటన అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి దృశ్యం చూసేందుకు సంతోషంగా ఉందని ఒకరు అన్నారు. కోవిద్ లాంటి భయానక సమయంలో మనసు కరిగించే ఘటన ఇదంటూ ఒకరు కామెంట్ చేయగా, శాంటా క్లాజ్ ఆ బాలుడికి సంతోషాన్ని పంచడం ఆనందంగా ఉందంటూ మరొకరు కామెంట్ చేసారు.

Also Read: Anil Kapoor turns 65: అనిల్ కపూర్ 65వ పుట్టినరోజు: శుభాకాంక్షలు తెలిపిన అన్న బోనీ కపూర్