Hyderabad crime
హైదరాబాద్‌లోని మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనే యువకుడు తన భార్య స్వాతిని కిరాతకంగా హత్య చేసిన కేసుపై మల్కాజిగిరి డీసీపీ పద్మజ వివరాలు తెలిపారు. ఇవాళ పద్మజ మీడియా సమావేశంలో మాట్లాడారు.
“మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్నాడు.
స్వాతి పంజాగుట్ట లోని కాల్ సెంటర్లో పనిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు ఉండేవి. వికారాబాద్‌లో 498 సెక్షన్ కింద కేసు కూడా అయ్యింది. పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయ్యారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేవాళ్లు.
Also Read: పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. త్వరలోనే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు:కేటీఆర్
ఇదే తరహాలో ఈ నెల 22న కూడా గొడవ పడ్డారు. స్వాతి గర్భవతి. స్వాతి మొదటిసారి గర్భవతి ఐనప్పుడు గర్భం తీయించాడు.
పెళ్లై ఏడాది కూడా అవలేదు.. ఆర్థికంగా ఇంకా కుదురుకోలేదు.. అప్పుడే ఎందుకు అని మహేందర్ రెడ్డి అన్నాడు.
స్వాతి పేరెంట్స్ కి కూడా ఇదే విషయం చెప్పాడు.. వాళ్లు కూడా మీ ఇష్టం అని చెప్పారు.
రెండో సారి కూడా గర్భం తీయించుకోవాలని పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి.
మెడికల్ చెకప్ కి తీసుకెళ్లాలని అడిగింది. ఈ విషయంలో మొదలైన గొడవ పెద్దగా అయ్యింది.
భార్య స్వాతిని హత్య చేయాలని మహేందర్ రెడ్డి ప్లాన్ చేశాడు. బోడుప్పల్ లో ఒక హాక్సా బ్లేడ్ కొన్నాడు. ఇంట్లో ఉన్న భార్యను గొంతు నులిమి చంపేశాడు.
ఆ తర్వాత హాక్సా బ్లేడ్ తో ముక్కలు ముక్కలు చేశాడు. తల ఒకసారి.. కాళ్లు ఒకసారి.. చేతులు మరోసారి.. ఇలా మూడు సార్లు కవర్లలో చుట్టి శరీర భాగాలను పడేశాడు.
మేడిపల్లి పోలీసులకు మహేందర్ రెడ్డిపై అనుమానం వచ్చింది.
ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా విషయం మొత్తం చెప్పాడు. 4 గంటల గ్యాప్ లో మూడు సార్లు మూసీ వద్దకు వెళ్లి వచ్చాడు. కాళ్లు ఒకసారి.. చేతులు ఒకసారి.. తల ఒకసారి.. ఇలా మూడు సార్లు తీసుకెళ్లి పారేశాడు.
మొత్తం బాడీ మాయం చేయాలని ప్లాన్ చేశాడు. అంతలోనే భయపడ్డాడు.. భయంతోనే చెల్లికి కాల్ చేశాడు..” అని చెప్పారు.