seven people riding on a single bike
IPS Sajjanar : సాధారణంగా బైక్ మీద ఎంతమంద్రి ప్రయాణం చేయవచ్చు. ఇద్దరు ప్రయాణించొచ్చు. మహా అయితే ముగ్గురు. కానీ త్రిబుల్ రైడింగ్ మంచిది కాదు. కానీ ఒకే ఒక్క బైక్ మీద ముగ్గురు కాదు నలుగురు కూడా కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. బైక్ మీద ఏడుగురు కూడా రయ్ మంటు దూసుకుపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఏంటీ ఒక్క బైక్ మీద ఏడుగురు ప్రయాణమా..?వింటే షాకింగ్ గా ఉందా..? ఉంటుంది మరి..అది బైకా లేకపోతే సెవన్ సీటర్ ఆటోనా..? అని కూడా అనుకుంటాం. అయినా బైక్ మీద ఏడుగురు ఎలా కూర్చున్నారబ్బా..కూర్చోవటమే కష్టమైతే ఏకంగా రయ్ మంటు దూసుకుపోవటమా..? అదెలా సాధ్యం అనుకుంటున్నారా?ఇదిగో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఈ బైక్ ను నడిపే వ్యక్తి పెట్రల్ ట్యాంక్ పైనే కూర్చుని నడుపుతున్నాడు. అతని వెనుక ఐదుగురు కూర్చోగా..మరో వ్యక్తి మాత్రం అందరికంటే లాస్ట్ లో కూర్చున్న వ్యక్తి భుజాలపై కూర్చున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలో జరిగిందీ వింత బైక్ రైడింగ్..
ఇటువంటి ప్రయాణాలు ఎంత ప్రమాదమో సజ్జనార్ తెలిపారు. ప్రాణాలే పోతాయి అంటూ హెచ్చరించారు. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం అంటూ పేర్కొన్నారు. మరీ ఈ ఏడుగురు ఏమాత్రం భయం లేకుండా ఒక్క బైక్ పై ఏడుగురు ప్రయాణించే వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..
ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణమా?
ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం… pic.twitter.com/O9f6Ll7ekf
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 9, 2023