Watermelon : ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిదేనా ?

ఎవరైనా లెప్టిన్ రెసిస్టెన్స్ లక్షణాలను కలిగి ఉంటే అనగా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే, అల్పాహారంగా పుచ్చ పండును తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇది లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

Watermelon

Watermelon : ఉదయాన్నే హైడ్రేట్ గా ఉండటం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవచ్చు. రోజుకు సరిపడా శక్తిని నింపుకోవచ్చు. పుచ్చకాయ రోజును ప్రారంభించటం అన్నది ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో ఒకటిగా చెప్పవచ్చు. దీనిలో 90% నీరు మరియు విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఈ పండు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

అధిక ఫైబర్ కంటెంట్ మరియు పోషక విలువలు కలిగి ఉండటం వల్ల పుచ్చకాయను అల్పాహారంగా తీసుకునేందుకు సరైన పండుగా చెప్పవచ్చు. అయితే పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినే విషయంలో కొంత ఆలోచించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఖాళీ కడుపుతో ఎవరు పుచ్చకాయ తినకూడదు?

ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవడం వారి శరీర తత్వాన్ని బట్టీ హార్మోన్ల పనితీరు ఆధారంగా ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూరవచ్చు లేదంటే ప్రయోజనం పొందకపోవచ్చు. ఎవరైనా లెప్టిన్ రెసిస్టెన్స్ లక్షణాలను కలిగి ఉంటే అనగా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే, అల్పాహారంగా పుచ్చ పండును తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇది లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

అయితే ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు ఈ పండును తక్కువ పరిమాణంలో చిరుతిండిగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. శరీరంలో అధిక లెప్టిన్ స్రావం కారణంగా సున్నితత్వం తగ్గి, ఫ్రక్టోజ్ అసహనానికి కారణమవుతుంది. తద్వారా శరీరంలో అధిక కొవ్వు ఉత్పత్తి , నిల్వకు కారణమవుతుంది. ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఫ్రక్టోజ్ అసహనం ఉన్నవారికి ఉదయాన్నే పుచ్చకాయ తినడం హానికరం. ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో ఎవరు పుచ్చకాయ తినాలి?

శరీరం పండ్లను బాగా తట్టుకోగల వ్యక్తి మంచి పోషకాల శోషణ కోసం ఉదయాన్నే పుచ్చపండును తినవచ్చు. మొత్తం పండుగా తిన్నప్పుడు పండులో ఫైబర్ ఉండటం వల్ల గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడుతుంది.