Viral Video
Viral Video: చిన్నారుల చేష్టలు భలే అలరిస్తుంటాయి. వారు ఏది చేసినా పెద్దవాళ్లకు ముద్దొస్తారు. చిన్నారులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగానే ఉంటాయి. వాటిని చూస్తున్న వేళ మనసుకు హాయి కలుగుతుంది. తాజాగా, ఇద్దరు చిన్నారుల వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
ఇందులో ఆ పిల్లాడు, ఓ పాప ఉంటారు. ఆ పిల్లాడి వద్దకు వచ్చిన పాప అతడికి ముద్దు ఇస్తుంది. ఆ వెంటనే ఆ బాబు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తాడు. ఆ పిల్లాడు అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేయడంపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీడియోలన్నింటి కంటే ఇది ఉత్తమ వీడియో అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
చాలా క్యూట్ గా ఉందని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. అతడి మొదటి ముద్దు అని ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి అన్నాడు. ఈ వీడియోను ఎన్నిసార్లు చూసినా మరోసారి చూడాలనిపిస్తోందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఆటల్లో ఇదో రకం ఆట అని కొందరు కామెంట్లు చేశారు. తమకూ చిన్నప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కొందరు పేర్కొన్నారు.
His first kiss.. ? pic.twitter.com/6BSV8XwdpP
— Buitengebieden (@buitengebieden) January 11, 2023