Most Wanted Maoist Hidma is Safe : ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్‌కౌంటర్ నుంచి మరోసారి తప్పించుకున్నమోస్ట్ వాటెండ్ హిడ్మా..

చత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ అలియాస్‌ హిడ్మా తప్పించుకున్నాడు. హిడ్మా సేఫ్ అనే విషయాన్ని దృవీకరిస్తు మావోయిస్టు పార్టీ ఫోటోను..లేఖను విడుదుల చేసింది.

Most Wanted Maoist Hidma is Safe : ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్‌కౌంటర్ నుంచి మరోసారి తప్పించుకున్నమోస్ట్ వాటెండ్ హిడ్మా..

Most Wanted Maoist Hidma is Safe

Most Wanted Maoist Hidma is Safe : చత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ అలియాస్‌ హిడ్మా తప్పించుకున్నాడు. ఛత్తీస్ గఢ్ లో పోలీసులు, సీఆర్పీఎప్ దాడుల నుంచి హిడ్మా చాకచక్యంగా ఎస్కేప్ అయ్యాడు. బీజాపూర్ జిల్లాలోని దండకారణ్యంలో బుధవారం (జనవరి 11,2023) భీకర దాడులు జరిపాయి భద్రతాదళాలు. పోలీసులకు సవాల్‌గా మారిన మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) మొదటి బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ అలియాస్‌ హిద్ముల్లా టార్గెట్‌గా పోలీసులు స్పెషల్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. ఇప్పటికే పలుమార్లు తప్పించుకున్న హిడ్మా మరోసారి తప్పించుకున్నాడు. 2021 ఏప్రిల్‌ 4న బీజాపూర్‌ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్న హిడ్మా మృతి చెందాడని ప్రచారం జరిగింది. కానీ చత్తీస్ గడ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో హిడ్మా తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ దృవీకరిస్తూ లేఖ రాసింది. ‘హిడ్మా సేఫ్’ అంటూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదుల చేసింది. హిడ్మా మృతి అంటూ జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ మావోయిస్టు పార్టీ బస్తర్ డివిజన్ కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. దక్షిణ బస్తర్ లోని అటవీ ప్రాంతంలో వైమానిక దాడులల్లో హిడ్మా చనిపోలేదని మావోయిస్టు పార్టీ దృవీకరిస్తూ ‘హిడ్మా సేఫ్’ అంటూ ఓ ఫోటోతో పాటు లేఖను విడుదల చేసింది. దీంతో పాటు భద్రతాదళాల దాడులను ఖండిస్తూ ఓ లేఖను విడుదుల చేసింది.

మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. మావోయిస్టుల గాలింపును తీవ్రం చేసిన క్రమంలో బుధవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న క్రమంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఓ శిబిరంలో హిడ్మా ఉన్నాడనే పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్‌ నిర్వహించింది. కాల్పులు జరిపింది. దీంతో ఎదురుకాల్పులు జరిపారు మావోయిస్టులు. ఈ ఘటనలో గాయపడిన భద్రతా బలగాలను తీసుకువచ్చేందుకు వెళ్లిన హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారని.. ఈ ఘటనలోనే హిడ్మా మృతిచెందినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగింది. కానీ హిడ్మా చనిపోలేదని సేఫ్ గా ఉన్నాడంటూ మావో పార్టీ దృవీకరించింది. హిడ్మా కోసం కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. 4 నెలల క్రితం భద్రతా బలగాల ఆపరేషన్‌ నుంచి కూడా హిడ్మా తప్పించుకున్నాడు. ఇలా ప్రతీ దాడుల నుంచి హిడ్మా తప్పించుకుంటునే ఉన్నాడు.

Maoist Killed In Encounter : బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి

దాడుల వ్యూహకర్త హిడ్మా..స్కెచ్ వేశాడంటే సక్సెస్సే..
సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా 7th calss మాత్రమే చదివాడు. మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై 17 ఏళ్లకే పార్టీలో చేరాడు. భారీ దాడుల వ్యూహకర్తగా పేరున్న హిడ్మా ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) నంబర్‌ 1 బెటాలియన్‌ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేసి చిన్నవయసులోనే కేంద్ర కమిటీలో స్థానానికి చేరుకున్నాడు. అంటే హిడ్మా ఎంత చురుకో..ఎంత ప్లానింగ్ గా ఉంటాడో.. అర్థం చేసుకోవచ్చు.

20 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో హిడ్మా ఆద్వర్యంలోనే పలు దాడులు జరిగాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చింతల్నార్‌, డోర్నాపాల్‌, తాడిమెట్ల, మినప.. ఇలా భారీగా ప్రాణనష్టం జరిగిన అనేక ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొని 200 మందికి పైగా పోలీసు సిబ్బందిని బలి తీసుకున్నాడు. యుద్ధ నైపుణ్యాలతో పాటు చక్కటి మెలకువల్ని కేడర్‌కు అలవోకగా నూరిపోస్తుంటాడు హిడ్మా. కూంబింగ్‌ ఆపరేషన్లు నిర్వహించే పోలీసు బలగాలపై, సీఆర్పీఎఫ్‌ శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించడంలో హిడ్మా అందెవేసిన చెయ్యి.

మావోయిస్టు పార్టీలో 2006లో బెటాలియన్లు ప్రారంభించినప్పనుంచి ఆ బెటాలియన్లలోనే కొనసాగుతున్నాడు. బెటాలియన్లలో ఉండే మావోయిస్టుల్ని దాడులకు సమాయత్తం చేయడంలో నేర్పరిగా గుర్తింపు ఉంది. పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది. ఇతడిపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సుమారు రూ.45 లక్షల రివార్డు ప్రకటించింది. ఆయుధాల్ని, ఐఈడీ బాంబుల్ని, బూబీట్రాప్‌లను తయారు చేయడంలో హిడ్మాకు మంచు పట్టుంది. అటువంటి హిడ్మా టార్గెట్ గా అతనిడికి అంతమొందించటమే లక్ష్యంగా దండకారణ్యంలో బలగాలు ముందుకు సాగుతున్నాయి.

హెలికాప్టర్‌, డ్రోన్ల ద్వారా వేట సాగించినా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు చిక్కినట్లే చిక్కి.. తప్పించుకున్నాడు హిడ్మా. పాతికేళ్లుగా పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్ గా ఉన్న హిడ్మా ‌.. తలపై రూ.45లక్షల రివార్డును ప్రకటించింది చత్తీస్ గడ్ ప్రభుత్వం. 2007లో సుక్మా జిల్లా ఉర్పల్‌మెట్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి,2010లో తడ్‌మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి,2013లో జీరామ్‌ఘాటీ వద్ద కాంగ్రెస్‌ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర ఇలా హిడ్మా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. 2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను హతమార్చిన రాక్షసుడు హిడ్మా. అటువంటి హిడ్మా మరోసారి ఎస్కేప్ అయ్యాడని దృవీకరిస్తే మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది.