Parliament Budget Sessions
#BudgetSession: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు హాజరుకావడం లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ చెప్పారు. శ్రీనగర్ విమానాశ్రయంలో పొగ మంచు కారణంగా విమానాలు ఆలస్యంగా వస్తుండడమే ఇందుకు కారణమని వివరించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా నిన్న శ్రీనగర్ లో ముగింపు సభకు పలువురు కాంగ్రెస్ ఎంపీలు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు శ్రీనగర్ లోనే ఉన్నారు. దీంతో వారు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ కాంగ్రెస్ నేతలు పాల్గొనలేదు.
కాంగ్రెస్ ఎంపీ నాజీర్ హుస్సేన్ ఈ సమావేశంలో పాల్గొనాలని అనుకున్నప్పటికీ శ్రీనగర్ లో హిమపాతం వల్ల విమానాలు లేకపోవడంతో హాజరు కాలేదు. మరోవైపు, ద్రౌపది ముర్ము ప్రసంగించే సమయంలో పార్లమెంటు హౌస్ బయటే ఉంటామని, ఆమె ప్రసగాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని ఇప్పటికే బీఆర్ఎస్, ఆప్ ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం అసమర్థ పాలనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాయి. కాసేపట్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం ప్రారంభం కానుంది.
Future of test cricket: టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆందోళన