No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించినప్పటికీ, దానిపై ఇంకా చర్చ ప్రారంభం కాలేదు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాల గట్టి పట్టుదలతో ఉన్నాయి. గురువారం కూడా విపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. నల్లదుస్తులు ధరించి నిరసనపై బీజేపీ అవహేళన చేసి ప్రశ్నలు సంధించింది. భవిష్యత్తులో కూడా ప్రతిపక్ష సభ్యులు నల్ల బట్టలతో ఉండాల్సి వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు.
2047లో అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయా అని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రశ్నించారు. గందరగోళం, నినాదాల మధ్య తరచూ అంతరాయం ఏర్పడడంతో ఉభయ సభలను శుక్రవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీని ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి బహిష్కరించారు.
విపక్ష కూటమికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రధాని మోదీ రాజస్థాన్‌కు వెళుతున్నారని, అయితే మణిపూర్‌లో హింస, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై సభలో మాట్లాడేందుకు ఆయనకు సమయం లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మరోవైపు, అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉండగానే సభలో బిల్లును ఆమోదించడం నిబంధనలకు విరుద్ధమని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు.
Ramdas Athawale: మళ్లీ బీజేపీ చెంతకు నితీశ్ కుమార్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటన మధ్యలో విపక్ష సభ్యులు అడ్డుకోవడంపై పీయూష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైశంకర్ ప్రసంగం సమయంలో గందరగోళం తర్వాత, అధిర్ రంజన్ చౌదరి ఆర్డర్ ప్రశ్నను లేవనెత్తాలనుకున్నప్పుడు, పీయూష్ గోయల్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.