Rahul Gandhi Marriage: ‘రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా’ అని ప్రశ్నించిన మహిళా రైతుకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన సోనియా గాంధీ
ఆ రైతులతో రాహుల్, ప్రియాంక, సోనియా కాసేపు సరదాగా గడిపారు. వారితో డాన్స్ చేశారు. పాటలు పాడారు. వారి సమస్యల్ని పంచుకున్నారు. ఈ సందర్భంలోనే ఒక మహిళా రైతు స్పందిస్తూ ‘రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా?’ అని సోనియాను ప్రశ్నించారు

Woman Farmer Asks Sonia: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా లేదా అన్న దాని తర్వాత అతి ఎక్కువగా చర్చనీయాంశమయ్యే విషయం ఆయన పెళ్లి. అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే కొద్ది కాలం క్రితం దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ఇందిరా, సోనియాలను కలగలిపిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని సమాధానం చెప్పారు. అయినప్పటికీ పలు సందర్భాల్లో మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం పాట్నాలో జరిగిన విపక్షాల మొదటి సమావేశంలో ఏకంగా రాహుల్ గాంధీతోనే ‘ఇక పెళ్లి చేసుకో.. మీ అమ్మ చాలా బాధడుతోంది’ అని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు.
తాజాగా సోనియా గాంధీకి ఇదే ప్రశ్న ఎదురైంది. హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం కొంతమంది మహిళా రైతులతో కలిసి రాహుల్ గాంధీ నాటు వేసిన విషయం తెలిసిందే. అయితే వారిని తాజాగా ఢిల్లీలోని తన తల్లి ఇంటికి పిలిచారు రాహుల్. ఆ రైతులతో రాహుల్, ప్రియాంక, సోనియా కాసేపు సరదాగా గడిపారు. వారితో డాన్స్ చేశారు. పాటలు పాడారు. వారి సమస్యల్ని పంచుకున్నారు. ఈ సందర్భంలోనే ఒక మహిళా రైతు స్పందిస్తూ ‘రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా?’ అని సోనియాను ప్రశ్నించారు. దీనికి సోనియా సెకన్ వేస్ట్ చేయకుండా ‘అతడికి ఒక అమ్మాయిని చూసిపెట్టు’ అంటూ సమాధానం చెప్పారు.
मां, प्रियंका और मेरे लिए एक यादगार दिन, कुछ खास मेहमानों के साथ!
सोनीपत की किसान बहनों का दिल्ली दर्शन, उनके साथ घर पर खाना, और खूब सारी मज़ेदार बातें।
साथ मिले अनमोल तोहफे – देसी घी, मीठी लस्सी, घर का अचार और ढेर सारा प्यार।
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/2rATB9CQoz pic.twitter.com/8ptZuUSDBk
— Rahul Gandhi (@RahulGandhi) July 29, 2023
దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ‘చేసుకుంటాను’ అనే అర్థంలో సమాధానం చెప్పారు. ఇక మహిళా రైతులతో కలిసి తాను, సోనియా, ప్రియాంక చేసిన హడావిడిని డాన్సుల వీడియోను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘కొంతమంది ప్రత్యేక అతిథులతో గడపడం అమ్మకు, ప్రియాంకకు, నాకు గుర్తుండిపోయే రోజు! సోనిపట్‌లోని రైతు సోదరీమణులు ఢిల్లీని దర్శించడం, ఇంట్లో వారితో కలిసి భోజనం చేయడం, చాలా సరదాగా గడిచింది. వారితో కలిసి గడపడం అమూల్యమైన బహుమతి – దేశీ నెయ్యి, స్వీట్ లస్సీ, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలతో పాటు చాలా ప్రేమను మాకోసం తీసుకొచ్చారు’’ అని ట్వీట్ చేశారు.