ఆహారంలో బొద్దింక.. ఫుడ్‌ పాయిజనింగ్‌.. వీడియో పోస్ట్ చేసిన కస్టమర్

ఫుడ్ సరఫరా చేసే నిర్వాహకులు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

విమానాలు, రైళ్లలో ఆహారం తినాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆహారం నాసిరకంగా ఉందంటూ ఫిర్యాదులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఓ ఎయిర్‌ ఇండియా ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బొద్దింక కనపడింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సుయేషా సావంత్‌ తన రెండేళ్ల కొడుకుతో కలిసి ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్న సమయంలో వారికి ఇచ్చిన ఆమ్లెట్‌లో బొద్దింక కనపడింది. దీంతో ఆమె ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది.

“ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో నాకు ఇచ్చిన ఆమ్లెట్‌లో బొద్దింక కనపడింది. నా 2 ఏళ్ల కుమారుడు, నేను ఆమ్లెట్‌ను సగం తిన్నాక ఈ విషయాన్ని గుర్తించాం. దీంతో ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడ్డాం” అని సుయేషా చెప్పారు. ఆమె చేసిన పోస్టుపై ఎయిర్ ఇండియా స్పందించింది.

”మీకు ఇటువంటి అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నాం. దయచేసి మీ బుకింగ్ వివరాలను డైరెక్ట్ మెసేజ్‌ ద్వారా షేర్ చేయండి. మేము వెంటనే దర్యాప్తు చేస్తాము” అని తెలిపారు. ఫుడ్ సరఫరా చేసే నిర్వాహకులు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

Nepal Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 112 మంది మృతి.. అప్రమత్తమైన బీహార్ ప్రభుత్వం