Polls to 5 states : నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7లోగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణ పోలింగ్ డిసెంబర్ 7?

దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది....

Polls to 5 states

Polls to 5 states : దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీల మధ్య ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.

Also Read : సిక్కిం మెరుపు వరదల్లో 19కి పెరిగిన మృతుల సంఖ్య, 98 మంది గల్లంతు

చత్తీస్ ఘడ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12 నుంచి 20 వతేదీల మధ్య, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు నవంబర్ 28వ తేదీన, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉండవచ్చు. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీల మధ్య ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.