Ram Charan : పెద్ది మూవీ షూటింగ్‌లో గాయపడ్డ రామ్‌చ‌ర‌ణ్.. త్వరగా కోలుకోవాలనీ పవన్ కళ్యాణ్ ఆకాంక్ష

పెద్ది సినిమా షూటింగ్‌లో రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) గాయ‌ప‌డ్డారు.

Ram Charan injured on Peddi movie shooting Pawan kalyan wishes speedy recovery

  • పెద్ది సినిమా షూటింగ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌కు గాయం
  • త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించిన ప‌వ‌న్‌

Ram Charan : మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పెద్ది చిత్రంలో న‌టిస్తున్నారు. బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జాన్వీక‌పూర్ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో రామ్‌చ‌ర‌ణ్ గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో రామ్‌చ‌ర‌ణ్ కంటి స‌మీపంలో స్వ‌ల్ప గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ గాయంపై చిత్ర బృందం స్ప‌ష్ట‌త ఇచ్చింది. అభిమానులు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదంది. వైద్యుల సూచ‌న మేర‌కు చ‌ర‌ణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని పేర్కొంది.

Anna Lezhneva : సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ భార్య అన్నా లెజినోవా.. క్యూట్ ఫోటో షేర్ చేసి..

రామ్‌చ‌ర‌ణ్ త్వరగా కోలుకోవాలి..

పెద్ది చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌పడిన రామ్‌చ‌ర‌ణ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఏపీ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు.

‘పెద్ది సినిమా షూటింగ్ స‌మ‌యంలో రామ్‌చ‌ర‌ణ్ గాయ‌ప‌డ్డార‌ని తెలిసింది. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను.’ అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.

Puri Jagannadh Daughter : ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ కూతురు.. ప‌విత్ర క్యూట్ ఫోటోలు వైర‌ల్‌..

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా పెద్ది చిత్రం తెర‌కెక్కుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.