RCB Sale : ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. కొత్త యాజమాన్యం వచ్చేస్తోంది..! ఆ ఇద్దరు మధ్య పోటాపోటీ.. 2 బిలియన్ డాలర్లుపైనే..

RCB Sale : ఐపీఎల్ లీగ్ లోనే అత్యంత పాపులర్ టీమ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం మారబోతోంది. ఆ టీంను కొనుగోలు చేసేందుకు రెండు సంస్థలు పోటీలో ఉన్నాయి.

Royal Challengers Bengaluru RCB Sale Update : Bid Likely To Cross USD 2 Billion Two Contenders In Final Stage

  • ఆర్సీబీని అమ్మేయడం ఫిక్స్
  • చివరి దశకు అమ్మకం ప్రక్రియ
  • రెండు బిలియన్ డాలర్ల బిడ్ దాటే అవకాశం

RCB Sale : ఐపీఎల్ 2026 టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో పది రోజుల్లో ఐపీఎల్ పండుగ షురూ కానుంది. ఇప్పటికే ఆయా జట్ల సభ్యులు ప్రాక్టీస్ సైతం మొదలు పెట్టారు. 2025 ఐపీఎల్‌ టోర్నీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈసారి కూడా టోర్నీ విజేతగా నిలిచేందుకు సమాయత్తం అవుతుంది. అయితే, ఈసారి ఆర్సీబీ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఆర్సీబీ జట్టును దక్కించుకునేందుకు రెండు బడా కంపెనీల మధ్య పోటీ నెలకొంది.

Also Read : IPL 2026 : ఎస్ఆర్‌హెచ్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా టీమిండియా విధ్వంసకర బ్యాటర్..! ఇక రచ్చరచ్చే

ఐపీఎల్ లీగ్ లోనే అత్యంత పాపులర్ టీమ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఈ టీమ్ యాజమానిగా ఉన్న డియాజియో  సంస్థ తమ కార్యకలాపాలను వేరేవారికి అప్పగించాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఆర్సీబీ టీమ్ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ఇంత భారీ ధర కావడంతో చాలా మంది రేసు నుంచి తప్పుకోగా.. స్వీడన్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ EQT భారీ బిడ్ వేసింది. ఈ సంస్థతో పాటు రంజన్ పాయ్ నేతృత్వంలోని కన్సార్టియం కూడా గట్టిపోటీ ఇస్తోంది. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి డియోజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా నిర్ణయించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా అమ్మకానికి సిద్ధమైంది.ఈ టీమ్ కోసం ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ట్రైమ్స్ గ్రూప్ కు ఇప్పటికే ఇంగ్లాండ్ లోని ద హండ్రెడ్ లీగ్ లో లండన్ స్పిరిట్ టీమ్ లో వాటా ఉండటం విశేషం. అయితే, రాజస్థాన్ రాయల్స్ విలువను దాదాపు 1.1 బిలియన్ డాలర్ల నుంచి 1.35 బిలయన్ డాలర్ల మధ్య అంచనా వేస్తున్నారు. ఈ అమ్మకపు ప్రక్రియను రైన్ గ్రూప్ పర్యవేక్షిస్తోంది. ఇదే సంస్థ ‘ది హండ్రెడ్’లోని ప్రాంచైజీల అమ్మకాన్ని కూడా పర్యవేక్షిస్తుంది.