Sai Durgha Tej : పిల్లల కోసం సాయి దుర్గ తేజ్ విరాళం.. వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో ఫ్యామిలీతో పాల్గొని..

నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు.

Sai Durgh Tej Donates amount to Pure Little Hearts Foundation on World Heart Day

Sai Durgha Tej : మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన మామయ్యల లాగే సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు సాయి తేజ్. ఇటీవల వరద బాధితులకు రెండు రాష్ట్రాలకు 20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే అమ్మ అనాధాశ్రమానికి, పలు సేవా సంస్థలకు 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఇలా రెగ్యులర్ గా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, విరాళాలు ఇస్తున్న సాయి తేజ్ తాజాగా మరో ఫౌండేషన్ కి విరాళం ఇచ్చారు.

Also Read : Allu Arjun – Allu Sneha Reddy : భార్యకు స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన బన్నీ.. సెల్ఫీలు పోస్ట్ చేసి..

నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కడి పిల్లలతో ముచ్చట్లు పెట్టారు, వారితో ఫొటోలు దిగారు సాయి దుర్గ తేజ్ కుటుంబం. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు 5 లక్షల రూపాయలు విరాళం అందించారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాయి తేజ్ మంచి మనుసుకి మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.