Allu Arjun – Allu Sneha Reddy : భార్యకు స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన బన్నీ.. సెల్ఫీలు పోస్ట్ చేసి..
నేడు సెప్టెంబర్ 29న అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి పుట్టిన రోజు.

Allu Arjun Special Birhday Wishes to his Wife Allu Sneha Reddy
Allu Arjun – Allu Sneha Reddy : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ తన భార్య బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెష్ చెప్పాడు. నేడు సెప్టెంబర్ 29న అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి పుట్టిన రోజు. దీంతో బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గతంలో తన భార్యతో దిగిన సెల్ఫీ ఫొటోలు షేర్ చేసి.. ఇలాంటి అద్భుతమైన మైల్ స్టోన్ డేలు మరిన్ని రావాలు అంటూ బర్త్ డే విషెష్ తెలిపాడు.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మళ్ళీ పాట పాడబోతున్నాడా? ఆ సినిమా కోసం..
ఇక బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. అల్లు అర్హ, అయాన్ ఫొటోలు, వీడియోలు, ఫ్యామిలీ ట్రిప్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం స్నేహ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లినట్టు సమాచారం. స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పలు వీడియోలు, ఫొటోలు షేర్ చేయడంతో ఎక్కడో జలపాతాల దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక బన్నీ ఫ్యాన్స్, నెటిజన్లు స్నేహకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.