Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మళ్ళీ పాట పాడబోతున్నాడా? ఆ సినిమా కోసం..
కీరవాణి సంగీత దర్శకత్వంలో పవన్ సాంగ్ ని పాడేసినట్టు సమాచారం.

Pawan Kalyan Sing a Song for HariHara VeeraMallu Movie Rumours goes Viral
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో పక్క చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి కష్టపడుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో వేసిన భారీ సెట్స్ లో హరిహర వీరమల్లు యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. అక్టోబర్ చివరి కల్లా హరిహర వీరమల్లు షూట్ పూర్తిచేస్తారని తెలుస్తుంది.
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడనున్నాడట. ఆల్రెడీ కీరవాణి సంగీత దర్శకత్వంలో పవన్ సాంగ్ ని పాడేసినట్టు సమాచారం. దీంతో పవన్ ఫ్యాన్స్ ఇది నిజమైతే బాగుండు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Ram Charan – Rhyme : రామ్ చరణ్ తో పాటు రైమ్ మైనపు బొమ్మ కూడా.. త్వరలోనే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో..
గతంలో పవన్ కళ్యాణ్ ఖుషి, తమ్ముడు, జానీ, గుడుంబా శంకర్, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి.. సినిమాల్లో చిన్న చిన్న సాంగ్స్ పాడి మెప్పించారు పవన్. ఇప్పుడు మరోసారి హరిహర వీరమల్లు సినిమాలో పవన్ పాట పాడాడు అనే వార్త తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ఇక హరిహర వీరమల్లు సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 28న రిలీజ్ కానుంది.