Samsung Galaxy M36 5G
Samsung Galaxy M36 5G : కొత్త శాంసంగ్ కొంటున్నారా? శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M36 5G ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో ఈరోజు (జూన్ 27) లాంచ్ అయింది. గత ఏడాదిలో (Samsung Galaxy M36 5G) మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ప్రవేశపెట్టిన శాంసంగ్ గెలాక్సీ M35 5Gకి ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్.
మిడ్ రేంజ్ M-సిరీస్ పోర్ట్‌ఫోలియోను కంపెనీ విస్తరించింది. కొత్త ఫోన్ కెమెరా, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్, శాంసంగ్ గెలాక్సీ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. వాటర్‌డ్రాప్ నాచ్ కూడా ఉంది.
ప్రాసెసర్ :
శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 2.4 GHz వద్ద ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ కాదు కానీ బ్రౌజింగ్, యాప్ స్విచింగ్ లేదా లైట్ గేమింగ్ వంటి టాస్కులకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 6GB ర్యామ్ మల్టీ టాస్కింగ్ బెస్ట్ ఆప్షన్.
డిస్‌ప్లే, బ్యాటరీ :
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్‌లు, 385ppi పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. 1500 నిట్స్ (HBM) బ్రైట్ నెస్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.
గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. ఎలాంటి సమస్యలు లేకుండా రోజంతా ఛార్జింగ్ వస్తుంది. బాక్స్‌లో ఛార్జర్ అందించడం లేదు.
కెమెరా ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ M36లో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్, 2MP సెకండరీ కెమెరాతో 3-కెమెరా బ్యాక్ సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) డే టైమ్ అద్భుతమైన షాట్‌లను క్యాప్చర్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ 30fps వద్ద 4K వరకు రికార్డ్ చేయగలదు. 13MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా సెల్ఫీలకు బెస్ట్ ఆప్షన్. ఏఐ ఫీచర్లతో కూడా వస్తుంది.
వీటిలో సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్ ఇంటిగ్రేషన్, కాంటెక్చువల్ అసిస్టెన్స్ వంటి ఏఐ AI సెలెక్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ మొత్తం ఆరెంజ్ హేజ్, సెరీన్ గ్రీన్, వెల్వెట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్రేమ్ ప్లాస్టిక్‌తో ఉండగా, బ్యాక్ సైడ్ మ్యాట్ గ్లాస్ లాంటి ఎండ్ కలిగి ఉంటుంది.
బ్యాంక్ ఆఫర్లు, ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ ధర రూ. 22,999కు లాంచ్ అయింది. అమోల్డ్ స్క్రీన్, 5G కనెక్టివిటీతో వస్తుంది. అతి తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనేందుకు చూసేవారికి ఈ శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు.
బ్యాంక్ ఆఫర్లతో రూ. 16,499 ప్రత్యేక లాంచ్ ధరకు అందుబాటులో ఉంటుంది. జూలై 12న ప్రారంభ సేల్ సందర్భంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కస్టమర్లు అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు లేదా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వివిధ కార్డ్ వారీ ఆఫర్లు భిన్నంగా ఉండవచ్చు. కానీ, ముందుగా కొనుగోలు చేసేవారికి భారీగా బెనిఫిట్స్ ఉంటాయి. అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చు.