Ayushman Card : ‘ఆయుష్మాన్ భారత్’ కార్డు తీసుకున్నారా? ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ. 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!
Ayushman Card : ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ. 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.

Ayushman Card
Ayushman Card : ప్రస్తుత రోజుల్లో వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భారీగా పెరుగుతోంది. ఆదాయం కన్నా ఖర్చుల భారం ఎక్కువగా ఉంటోంది. ప్రత్యేకించి ఏదైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో (Ayushman Card) చేరితే లక్షల్లో ఖర్చు అవుతుంది. అందరికి అంత చెల్లించే స్థోమత ఉండదు. అందుకే ఇలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు క్యాష్ లెస్, పేపర్‌లెస్ హాస్పిటిల్ కవరేజీని అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ అనేది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) అందించడమే లక్ష్యం.
ప్రతి పౌరుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా అవసరమైన వైద్య సేవలు పొందడమే పథకం ఉద్దేశం.. ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడిన లేదా ఏదైనా తీవ్రమైన/దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స పొందుతున్న వారికి వైద్యంపరంగా సాయం చేసేందుకు ఈ పథకం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఈ పథకంతో ప్రయోజనాలేంటి? :
ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కింద ఆయుష్మాన్ భారత్ కార్డు జారీ అవుతుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)కి లింక్ చేసి ఉంటుంది. ఈ కార్డుతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు, పథకం కింద ప్రయోజనాలను పొందవచ్చు.
ఆయుష్మాన్ కార్డు పొందిన తర్వాత పథకానికి లింక్ చేసిన నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎలాంటి డబ్బు చెల్లించకుండానే రూ. 5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు, తద్వారా అత్యవసర వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఆయుష్మాన్ కార్డుకు అవసరమైన డాక్యుమెంట్లు :
ఆయుష్మాన్ కార్డు (Ayushman Card) కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు చాలా అవసరం. ముందుగానే రెడీగా ఉంచుకోవడం వల్ల ప్రక్రియ సులభంగా ఉంటుంది.
- ఆధార్ కార్డు
- వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్
- ఇంటి అడ్రస్ ప్రూఫ్
- కుటుంబ వివరాలు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- బ్యాంక్ అకౌంట్ వివరాలు
- కుల ధృవీకరణ పత్రం
ఆయుష్మాన్ కార్డు (Ayushman Card) కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
ఆయుష్మాన్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవడం ఇప్పుడు గతంలో కన్నా సులభంగా ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
- ముందుగా, అధికారిక PMJAY వెబ్‌సైట్ (pmjay.gov.in) విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో టాప్ మెనూలోని ‘Am I Eligible’ ఆప్షన్ క్లిక్ చేయండి.
- వెరిఫికేషన్ కోసం మీ మొబైల్ నంబర్, OTP, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- ‘Login’ బటన్‌పై క్లిక్ చేసి పేజీ రీలోడ్ అయ్యే వరకు వేచి ఉండండి.
- రాష్ట్రం, జిల్లా, ‘By Search’ సరైన ఎంపికను ఎంచుకుని అవసరమైన సమాచారాన్ని (పేరు, ఆధార్ నంబర్ మొదలైనవి) ఎంటర్ చేయండి.
- ఇప్పుడు ‘Do e-KYC’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అథెంటికేషన్ కోసం ‘Aadhaar OTP’ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ ఆధార్ నంబర్ కోసం ‘Verify’ పై క్లిక్ చేయండి.
- ఆధార్ OTP, మొబైల్ OTP ఎంటర్ చేసిన తర్వాత e-KYC ID కనిపిస్తుంది.
- మీకు e-KYC ఫుల్ మెసేజ్ వస్తుంది.
- 15నుంచి 20 నిమిషాల e-KYC తర్వాత PMJAY వెబ్‌సైట్‌లోకి మళ్ళీ లాగిన్ అయి ‘Download Card’ బటన్‌ను ఎంచుకోండి.
- ఆయుష్మాన్ భారత్ యోజన కోసం రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టే.
- మీ ఆయుష్మాన్ కార్డును ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.