8th Pay Commission : 8వ వేతన సంఘం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరగొచ్చు.. గ్రేడ్ లెవల్ వారీగా ఎంత ఉండొచ్చంటే?
8th Pay Commission : 8వ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుందో క్లారిటీ లేదు. కొత్త ఫిట్‌మెంట్ అంశం, ఇతర అలవెన్సులతో నెట్ శాలరీ ఎంత ఉండొచ్చంటే?

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ (8th Pay Commission) ఉద్యోగుల్లో ఎప్పుడు అమల్లోకి వస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.
8వ వేతన సంఘం అనేది ముఖ్యంగా కొత్త ఫిట్‌మెంట్ అంశం, ఇతర అలవెన్సుల ప్రకారం నెట్ శాలరీ ఎంత ఉంటుందో అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. అయితే, 1.92 ఫిట్‌మెంట్ అంశం, X సిటీ HRA (30శాతం), హయ్యర్ TPTA కింద TAలను దృష్టిలో ఉంచుకుని లెవల్ 1 నుంచి లెవల్ 7 వరకు గ్రేడ్ పే ఆధారంగా జీతం ఎంత పెరగొచ్చు అనేది అంచనా వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జీతంలో ఎంత పెంపు ఉండొచ్చు? :
ఉద్యోగుల జీతం ఎంత పెంపు ఉంటుందనేది అంచనా వేయొచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92, డియర్‌నెస్ అలవెన్స్ (DA) 0శాతం (DA కొత్త పే కమిషన్‌లో బేసిక్‌లో విలీనం), ఏదైనా నగరానికి 30శాతం HRA, పెద్ద నగరాలకు హై TPTA ప్రాతిపదికగా పరిగణించి అంచనా వేయొచ్చు.
వాస్తవ గణాంకాలు మాత్రం 8వ పే కమిషన్ సిఫార్సులపై మాత్రమే ఆధారపడి ఉంటాయని గమనించాలి. ఎంత మొత్తంలో జీతాల్లో పెంపు ఉండొచ్చు అనేది ఒక అవగాహన కోసం మాత్రమే ఈ కింది ఉదాహరణలు అందించాం..
8వ కమిషన్ CPC వేతనం కాలిక్యులేటర్ :
లెవల్-1 (బేసిక్ పే రూ. 18వేలు ) రివైజ్డ్ బేసిక్ (1.92): రూ. 34,560 HRA (30శాతం ): రూ. 10,368 TA (హయ్యర్ TPTA): రూ.1,350 గ్రాస్ శాలరీ : రూ. 46,278 NPS + CGHS: రూ. 3,706 నెట్ శాలరీ : రూ. 42,572.
లెవల్-2 (బేసిక్ పే రూ.19,900) రివైజ్డ్ బేసిక్ (1.92): రూ.38,208 HRA (30 శాతం ): రూ.11,462 TA: రూ.1,350 గ్రాస్ శాలరీ: రూ.51,020 NPS + CGHS: రూ.4,071 నెట్ శాలరీ: రూ.46,949.
లెవెల్-3 (బేసిక్ పే రూ.21,700) రివైజ్డ్ బేసిక్: రూ.41,664 HRA: రూ.12,499 TA: రూ.3,600 గ్రాస్ శాలరీ: రూ.57,763 NPS + CGHS: రూ.4,416 నెట్ శాలరీ: రూ.53,347.
లెవెల్-4 (బేసిక్ పే రూ.25,500) రివైజ్డ్ బేసిక్: రూ.48,960 HRA: రూ.14,688 TA: రూ.3,600 గ్రాస్ శాలరీ: రూ.67,248 NPS + CGHS: రూ.5,146 నెట్ శాలరీ: రూ.62,102.
లెవెల్-5 (బేసిక్ పే రూ.29,200) రివైజ్డ్ బేసిక్: రూ.56,064 HRA: రూ.16,819 TA: రూ.3,600 గ్రాస్ శాలరీ: రూ.76,483 NPS + CGHS: రూ.5,256 నెట్ శాలరీ: రూ.70,627.
లెవెల్-6 (బేసిక్ పే రూ.35,400) రివైజ్డ్ బేసిక్: రూ.67,968 HRA: రూ.20,390 TA: రూ.3,600 గ్రాస్ శాలరీ: రూ.91,958 NPS + CGHS: రూ.7,247 నెట్ శాలరీ: రూ.84,711.
లెవల్-7 (బేసిక్ పే రూ.44,900) రివైజ్డ్ బేసిక్: రూ.86,208 HRA: రూ.25,862 TA: రూ.3,600 గ్రాస్ శాలరీ: రూ.1,15,670 NPS + CGHS + ఆదాయపు పన్ను (సుమారు రూ.6,670): రూ.15,931 నెట్ శాలరీ: రూ.99,739.