Foldable iPhone : ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు లీక్.. బిగ్ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరాలు అదుర్స్..!
Foldable iPhone : ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌కు ముందే పోల్డ్ ఫోన్ వచ్చే అవకాశం ఉందంటూ లీకులు వస్తున్నాయి..

Foldable iPhone
Foldable iPhone : ఆపిల్ అభిమానుల కోసం ఐఫోన్ మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ ఇంకా లేదు. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ కూడా మార్కెట్‌లోకి రాబోతుందంటూ చాలా కాలంగా పుకార్లు వస్తున్నాయి. ఆపిల్ అధికారికంగా ఫస్ట్ ఐఫోన్ ఫోల్డ్ లాంచ్‌ను ధృవీకరించలేదు. కానీ లీక్‌లను పరిశీలిస్తే.. శాంసంగ్, గూగుల్, వన్‌ప్లస్, వివో వంటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్‌లకు పోటీగా ఉండవచ్చని సూచిస్తున్నాయి.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో ఐఫోన్ ఫోల్డ్ గురించి కొన్ని కీలక వివరాలను షేర్ చేసింది. కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ప్రోటోటైప్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఐఫోన్ ఫోల్డ్ పేరుతో రానుంది. 2026 చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఫోల్డబుల్ మోడల్ కోసం హార్డ్‌వేర్‌పై కంపెనీ ఖరారు చేస్తోందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంకా టెస్టింగ్ స్టేజీలోనే తెలిపారు. అయితే, రాబోయే ఐఫోన్ ఫోల్డ్‌కు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేశారు.
ఐఫోన్ ఫోల్డ్ స్పెసిఫికేషన్లు లీక్ :
ఐఫోన్ ఫోల్డ్ 7.58-అంగుళాల లోపలి ఫోల్డబుల్ ప్యానెల్ ఉంటుందని విశ్లేషకుడు మింగ్-చి కువో పేర్కొన్నారు. 7.8-అంగుళాల కన్నా కొంచెం చిన్నదిగా ఉండొచ్చు. ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. ఐప్యాడ్ మినీ మాదిరిగా స్ర్కీన్ ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
కెమెరాల విషయానికొస్తే.. ఆపిల్ డ్యూయల్ 48MP కెమెరా సెటప్‌ను అందించనున్నట్టు కనిపిస్తోంది. ఐఫోన్ 17 ప్రో మోడళ్ల లీక్‌లకు తగినట్టుగా ఉంది. అయితే, అసలైన లెన్స్ ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
ఐఫోన్ ఫోల్డ్ డిజైన్ :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 15 ప్రో మోడళ్ల మాదిరిగానే టైటానియం బాడీ, అమోర్ఫస్ మెటాలిక్ గ్లాస్‌తో హింజ్ మెకానిజంను అందించవచ్చు. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఐఫోన్ ప్రోటోటైప్ స్టేజీలో ఉంది. ఆపిల్ ఫోల్డబుల్ కేటగిరీలోకి కొన్ని ఏళ్లు పట్టవచ్చు. ఇప్పటివరకు, ఈ సెగ్మెంట్‌లో శాంసంగ్, వన్‌ప్లస్, గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. లీక్‌లు నిజమైతే.. ఐఫోన్ ఫోల్డ్ 2026 ఏడాదిలో ఎప్పుడైనా లాంచ్ కావచ్చు.