Tomato ice cream : ‘టొమాటో ఐస్ క్రీం’ కొత్త ఫుడ్ కాంబినేషన్ .. ‘రిప్ టొమాటో’ అంటున్న నెటిజన్లు

ఆ మధ్య 'తందూరీ చికెన్ ఐస్ క్రీం' ఫుడ్ కాంబినేషన్ గురించి విని జనాలు షాకయ్యారు. తాజాగా ఓ వీధి వ్యాపారి 'టొమాటో ఐస్ క్రీం' తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్లు తింటే ఏమవుతుందో అని నెటిజన్లు మండిపడుతున్నారు.

Tomato ice cream

Tomato ice cream : సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ తయారు చేయడం.. వాటిని వైరల్ చేయడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. అవి తయారు చేస్తుంటే చూడటానికి.. తినడానికి కాస్త దైర్యం కావాలంతే. తాజాగా ఓ వీధి వ్యాపారి ‘టొమాటో ఐస్ క్రీం’ తయారు చేశాడు. ఆ వీడియో చూసి ‘రిప్ టొమాటో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

Child viral video : కారు హారన్‌కి భయపడిన చిన్నారి ఐస్ క్రీం కింద పడేసుకుంది.. కారు డ్రైవర్‌ని తిట్టిపోసిన నెటిజన్లు

ఐస్‌ క్రీం ఇష్టపడని వారు ఉండరు. చాక్లెట్, వనీలా, స్ట్రాబెర్రీ లేదా తమకు నచ్చిన ఇతర ఫ్లేవర్స్‌ని ఐస్ క్రీం లవర్స్ తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు టొమాటో-ఫ్లేవర్ ఐస్ క్రీం వచ్చింది. వామ్మో ఇదేం ఫ్లేవర్ అని ఉలిక్కిపడ్డారా?.. ఓ వీధి వ్యాపారికి వచ్చిన ఆలోచన నుంచి ఈ ఫ్లేవర్ పుట్టిందన్నమాట. అయితే దీనిని చూడటానికే ఎవరు ధైర్యం చేయలేకపోతుంటే.. తినే ధైర్యం ఎంతమందికి ఉంటుందో?

Tandoori chicken ice cream : తందూరి చికెన్ ఐస్ క్రీం .. తింటే ఏమవుతుందో?

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ (aapkabhai_foody) షేర్ చేసిన వీడియోలో ఒక వ్యాపారి ఐస్ క్రీం తయారు చేస్తుంటాడు. ముందుగా టొమాటాలు కోస్తాడు. వాటిని చాక్లెట్, మరియు క్రీమ్‌తో కలుపుతాడు. బాగా కలిపిన తర్వాత ఐస్ క్రీం చేసి టొమాటో ముక్కలతో గార్నిష్ చేసాడు. ఈ పోస్ట్ చూసి చాలామంది కామెంట్స్ చేశారు. ‘ఇలా చేస్తే ఫుడ్ పాయిజన్ అవుతుందని’ ఒకరు.. ‘రిప్ టొమాటో’ అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఈ కొత్త ఫుడ్ కాంబినేషన్లతో వైరల్ అవ్వడమేంటో కానీ మనుష్యుల ప్రాణాలతో చెలగాటమాడద్దని చాలామంది సూచిస్తున్నారు.