Praggnanandha: కొడుకు ఎదిగిపోయాడని.. మాటల్లో వివరించలేని తల్లి భావం.. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఫొటో

మాటల్లో వివరించలేని భావాన్ని కూడా ఒకే ఒక్క ఫొటో వర్ణిస్తుంది. మన హృదయాలను హత్తుకుంటుంది..

Grandmaster Rameshbabu Praggnanandhaa

Praggnanandha Touching Image: కొడుకు సాధించిన ఏ చిన్నపాటి విజయాన్ని చూసినా అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది తల్లి. అటువంటిది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్న కుమారుడిని చూస్తే? కుమారుడిని చూస్తూ ఆమె పడే ఆనందాన్ని మనం మాటల్లో వివరించలేం. కానీ, మాటల్లో వివరించలేని భావాన్ని కూడా ఒకే ఒక్క ఫొటో వర్ణిస్తుంది. మన హృదయాలను హత్తుకుంటుంది.. అటువంటి ఫొటోనే ఇది.

ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్ఞానంద (17) తాజాగా అజర్‌బైజాన్‌(Azerbaijan)లోని బాకులో జరిగిన ఫైడ్ ప్రపంచ కప్‌లో (FIDE World Cup) అర్జున్ ఎరిగైసిని 5-4 తేడాతో ఓడించాడు. దీంతో సెమీఫైనల్లో తన పేరును ఖరారు చేసుకున్నాడు. అనంతరం ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అతడి తల్లి నాగలక్ష్మికి అతడిని చూసిన ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.

Nagalakshmi

ఈ ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో చేరిన రెండో భారతీయుడు ఆర్.ప్రజ్ఞానంద. గతంలో విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత సాధించారు. దీంతో ఆర్.ప్రజ్ఞానందలోనూ కనపడని ఆనందం, అతడూ వ్యక్తం చేయలేనంత భావోద్వేగం అతడి తల్లి నాగలక్ష్మిలో కనపడింది. తన కుమారుడు చరిత్ర సృష్టించాడని ఆమె కళ్లవెంట నీరు కారాయి.

సరిగ్గా అదే సమయంలో ఫొటో గ్రాఫర్ కెమెరాను క్లిక్‌మనిపించాడు. మరో ఫొటోలో నాగలక్ష్మి కూర్చొని కన్నీరు తుడుచుకుంటుండడం చూడవచ్చు. తన తల్లి తనకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ప్రజ్ఞానంద తెలిపాడు. సెమీఫైనల్లో అతడు అమెరికాకు చెందిన ఫాబియానో ​​కరువానాతో చెస్ లో పోటీ పడాల్సి ఉంది.

World Photography Day 2023: ఫొటోగ్రాఫర్‌వా? డ్యాన్సర్‌వా? నీ డ్యాన్స్‌ను గనుక డ్యాన్సర్లు చూస్తే..