US accuses Russia of endangering nuclear arms control treaty
US accuses Russia: అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా ప్రమాదకరంగా మారుతోందని అమెరికా ఆరోపించింది. అమెరికా-రష్యా మధ్య ఉన్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని రష్యా పాటించడం లేదని తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు ఆ దేశ విదేశాంగ శాఖ నివేదిక సమర్పించింది.
రష్యా అణ్వాయుధాల కేంద్రాలను పరిశీలించడానికి అమెరికాకు పుతిన్ సర్కారు అనుమతి ఇవ్వలేదని చెప్పింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా ఈ చర్యలకు పాల్పడడం గమనార్హం. 2020 మార్చిలో కరోనా విజృంభణ కారణంగా ఇరు దేశాల మిలటరీ కేంద్రాల పరిశీలనకు బ్రేక్ పడింది. 2021 అక్టోబరులో ఒప్పందాన్ని ఐదేళ్ల పాటు పొడిగించారు.
అయితే, 2022 ఆగస్టులో రష్యా అణ్వాయుధాలను అమెరికా నిపుణులు పరిశీలించాల్సి ఉండగా రష్యా అందుకు సహకరించలేదు. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంలో ఆ దేశానికి అమెరికా సాయం చేస్తున్న నేపథ్యంలో రష్యా ఈ చర్యకు పాల్పడింది. అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం కొనసాగకుండా రష్యా చేస్తోందని, అమెరికా-రష్యా మధ్య చర్చలు కూడా జరగకపోవడానికి రష్యానే కారణమని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఆరోపించింది.
Jharkhand Apartment Fire Accident : అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14మంది సజీవదహనం