Jharkhand Apartment Fire Accident : అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14మంది సజీవదహనం

జార్ఖండ్ ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు.

Jharkhand Apartment Fire Accident : అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14మంది సజీవదహనం

Jharkhand Apartment Fire Accident : జార్ఖండ్ ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు. 13 అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో తొలుత మొదలైన మంటలు ఆ తర్వాత మిగత అంతస్తులకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

ఈ అపార్ట్ మెంట్ లో 400 మందికిపైగా నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అగ్నిప్రమాదం ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read..Deccan Mall Demolition : డెక్కన్ మాల్ కూల్చివేతలో తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన 6 ఫ్లోర్లు

ఈ ప్రమాదంలో 12మంది గాయపడ్డారు. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో జనాలు అపార్ట్ మెంట్ కు వచ్చారు. ఇంతలో మంటలు చెలరేగి ఘోరం జరిగిపోయింది. కాగా, అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

Also Read..Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. ఆ బిల్డింగ్‌లో ఒక అస్థిపంజరం లభ్యం

ధన్ బాద్ డిప్యూటీ కమిషనర్ సందీప్ సింగ్ ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై సీఎం హేమంత్ సొరేన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగి పలువురు చనిపోవడం విషాదకరం అన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం సోరేన్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.