Deccan Mall Demolition : డెక్కన్ మాల్ కూల్చివేతలో తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన 6 ఫ్లోర్లు

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ ను కూల్చేస్తున్న సమయంలో ఆరు అంతస్తులు ఒక్కసారిగా కుప్పకూలాయి. దట్టమైన పొగ చుట్టూ అలుముకుంది. ఆ సమయంలో అక్కడే ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు.(Deccan Mall Demolition)

Deccan Mall Demolition : డెక్కన్ మాల్ కూల్చివేతలో తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన 6 ఫ్లోర్లు

Deccan Mall Demolition : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ ను కూల్చేస్తున్న సమయంలో ఆరు అంతస్తులు ఒక్కసారిగా కుప్పకూలాయి. దట్టమైన పొగ చుట్టూ అలుముకుంది. ఆ సమయంలో అక్కడే ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అయితే, చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ముందే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో బిల్డింగ్ కూల్చివేత కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ దశలవారిగా భవనం కూల్చివేత పనులు చేస్తోంది.

అగ్నిప్రమాదానికి గురైన సికింద్రాబాద్ మినిస్ట‌ర్ రోడ్డులో డెక్క‌న్ మాల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్న సంగ‌తి తెలిసిందే. భ‌వ‌నం కూల్చివేత కంటే ముందే.. భవనం చుట్టుప‌క్క‌ల ఇళ్లలోని వారిని అధికారులు ఖాళీ చేయించారు. దీంతోతో పెను ప్ర‌మాదమే త‌ప్పింది.

Also Read..Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. ఆ బిల్డింగ్‌లో ఒక అస్థిపంజరం లభ్యం

డెక్కన్‌ మాల్‌ కూల్చివేత ప‌నులు గురువారం నుంచి కొన‌సాగుతున్నాయి. చుట్టు పక్కల బిల్డింగ్‌లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా హైడ్రాలిక్‌ క్రషర్‌ డిమాలిషన్‌ విధానంలో కూల్చివేస్తున్నారు. డైమండ్‌ కటింగ్‌తో ఒకేసారి భవనం కుప్పకూలకుండా, ఒకవైపు ఒరగకుండా కూల్చివేయడం ఈ యంత్రం ప్రత్యేకత.(Deccan Mall Demolition)

తొలుత భవనం చుట్టూ 125 మైక్రాన్‌ మందంతో ప్లాస్టిక్‌ షీట్‌ ఏర్పాటుకు రూ.26 వేలు, కూల్చివేత సామాగ్రికి దాదాపు రూ.11 లక్షలు, 20 కిలోమీటర్ల దూరానికి వ్యర్థాల తరలింపునకు రూ.22 లక్షలు కలిపి మొత్తం రూ.33.86 లక్ష అంచనా టెండర్‌ను పిలవగా, నగరానికి చెందిన ఎస్‌కె మల్లు అనే ఏజెన్సీ రూ.25.94 లక్షలకు టెండర్ వేసింది. దీంతో కూల్చివేత పనులను ఆ సంస్థకు అప్పగించారు.

Also Read..Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. 5, 6వ అంతస్తులకు లేని అనుమతులు

ఇటీవల డెక్కన్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని భవనం పూర్తిగా తగలబడింది. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదంలో భవనం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఏ క్షణమైనా భవనం కూలిపోవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జీహెచ్‌ఎంసీ అధికారులు, నిపుణులు పరిశీలించి భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో టెండర్లు పిలిచి భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. కూల్చివేస్తుండగానే ఒక్కసారిగా ఆరు ఫ్లోర్లు అమాంతంగా కిందకి పడిపోయాయి. అధికారులు ముందుగానే సమీప ఇళ్లల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించడంతో ఎలాంటి ముప్పు సంభవించలేదని, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని భయపడ్డారు. కూల్చివేత పనులు కొనసాగుతుండగానే.. ఆరు ఫ్లోర్లు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.