Viral Video: పట్టపగలు నడిరోడ్డుపై తుపాకీతో బెదిరించి మహిళ, బాలుడి నుంచి గొలుసు, స్మార్ట్‌ఫోన్ చోరీ
పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ, బాలుడిని తుపాకీతో బెదిరించి గొలుసు, స్మార్ట్‌ఫోన్ చోరీ చేశాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోనీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఆమె వెనుక నుంచి ఓ దొంగ తుపాకీ పట్టుకుని దూసుకువచ్చాడు.
- T Venkateshwarlu
- Published On : December 13, 2022 / 10:50 AM IST
Viral Video: పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ, బాలుడిని తుపాకీతో బెదిరించి గొలుసు, స్మార్ట్‌ఫోన్ చోరీ చేశాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోనీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఆమె వెనుక నుంచి ఓ దొంగ తుపాకీ పట్టుకుని దూసుకువచ్చాడు.
మెడలోని గొలుసు ఇచ్చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ చైను తీసి ఇచ్చింది. అనంతరం అక్కడ ఉన్న బాలుడిని బెదిరించి అతడి మొబైల్ ఫోనును కూడా తీసుకున్నాడు దొంగ. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పట్టపగలే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చోరీ జరిగిన తీరుపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాను పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, దీనిపై విచారణ జరుపుతున్నామని లోనీ డీఎస్పీ రాజనీశ్ కుమార్ ఉపాధ్యాయ్ మీడియాకు తెలిపారు. నిందితుడు నిజమైన తుపాకీ చూపాడా? లేదా బొమ్మ తుపాకీ చూపి బెదిరించాడా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
#WATCH | Uttar Pradesh | A woman’s chain and a boy’s mobile phone were snatched at gunpoint in broad daylight in Ghaziabad’s Loni area
A case has been registered & a team has been formed. Accused are being identified. Probe underway: Rajneesh Kumar Upadhyay, DSP, Loni (12.12) pic.twitter.com/ujHriLVrIs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2022
