Viral Pic: ఐపీఎల్ ట్విస్ట్.. ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఫొటో వైరల్

Viral Pic: ఐపీఎల్ లో క్లీన్ బౌల్డ్ అయిన వికెట్ కు సంబంధించిన ఫొటోను పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Viral Pic: ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో చమత్కారపూరితమైన పోస్టులు చేస్తూ ఢిల్లీ పోలీసులు (Delhi Police) అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం దేశం మొత్తం ఐపీఎల్ (IPL) ఫీవర్ పట్టుకున్న నేపథ్యంలో దీన్ని వాడుకుని ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు పోలీసులు.

ఐపీఎల్ లో క్లీన్ బౌల్డ్ అయిన వికెట్ కు సంబంధించిన ఫొటోను పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “నన్ను బ్రేక్ చేయండి.. కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ ను మాత్రం బ్రేక్ చేయకండి” అంటూ స్టంప్ అంటున్నట్లుగా పోలీసులు పోస్టు చేశారు. విరిగిపోయిన స్టంప్ ఫొటోపై ఈ వ్యాఖ్య రాసుకొచ్చారు. అలాగే, ట్రాఫిక్ సిగ్నల్ ను బ్రేక్ చేస్తే మీరు చలానా (జరిమానా)ను మాత్రమే గెలుచుకోగలరు అంటూ చమత్కరించారు.

ఢిల్లీ పోలీసులు ఈ పోస్టు చేసిన కాసేపటికే ఇది బాగా వైరల్ అయింది. అందరూ ఐపీఎల్ చూస్తుంటే పోలీసులు కూడా తమకు వినూత్నంగా ఐపీఎల్ వికెట్లనే చూపించారని కొందరు కామెంట్లు చేశారు. ఢిల్లీ పోలీసులు మీమర్స్ ను పనిలో పెట్టుకున్నారా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ మీమ్ ను సృష్టించింది ఎవరు? అని మరో నెటిజన్ అడిగాడు.

IPL 2023, RCB vs RR: ఉత్కంఠ‌పోరులో కోహ్లి సేన‌దే విజ‌యం

ట్రెండింగ్ వార్తలు