Viral Video: సైకిల్ తొక్కుతూ లోహ విహంగాన్ని నడిపించిన యువకుడు

ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ లోహ విహంగంలో వెళ్తూ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యంగ్ ఇంజనీర్లకు కొత్తగా, ప్రత్యేకంగా ఆకాశంలో ప్రయాణించాలని ఉంటుంది. అందుకోసం కొత్త కొత్త పద్ధతులు కనుగొంటుంటారు. తాజాగా ఇటువంటి విధానాన్నే కనుగొన్నారు కొందరు ఇంజనీర్లు. రెక్కలు, ఫ్యాన్లతో విమానాన్ని పోలి ఉన్న లోహ విహంగం కింద చతురస్రాకారంలో ఉన్న ఎన్‌క్లోజర్లో కూర్చొని ఓ యువకుడు సైకిల్ తొక్కుతుంటాడు.

Viral Video

Viral Video: ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ లోహ విహంగంలో వెళ్తూ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యంగ్ ఇంజనీర్లకు కొత్తగా, ప్రత్యేకంగా ఆకాశంలో ప్రయాణించాలని ఉంటుంది. అందుకోసం కొత్త కొత్త పద్ధతులు కనుగొంటుంటారు. తాజాగా ఇటువంటి విధానాన్నే కనుగొన్నారు కొందరు ఇంజనీర్లు. రెక్కలు, ఫ్యాన్లతో విమానాన్ని పోలి ఉన్న లోహ విహంగం కింద చతురస్రాకారంలో ఉన్న ఎన్‌క్లోజర్లో కూర్చొని ఓ యువకుడు సైకిల్ తొక్కుతుంటాడు.

అతడు సైకిల్ ను తొక్కుతుంటే ఆ లోహ విహంగ మిషన్ వేగంగా ముందుకు కదులుతుంది. కొద్ది సేపు గాల్లో తేలి మళ్ళీ నేలను తాకుతుంది. ‘‘సైకిల్ తొక్కుతూ లోహ విహంగంలో ప్రయాణించాలని ఈ యువకుడు ప్రయత్నిస్తున్నాడు’’ అని మొహమ్మద్ జష్మెద్ అనే నెటిజన్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

మంచి ప్రయత్నం చేశారని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే, ఆ లోహ విహంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. ఆ ఇంజనీర్లు చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు కొందరు కామెంట్లు చేశారు.

NASA’s Orion Capsule : సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన నాసా ఓరియన్ క్యాప్సూల్.. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్