NASA’s Orion Capsule : సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన నాసా ఓరియన్ క్యాప్సూల్.. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్

అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ (నాసా) ఓరియన్ క్యాప్సూల్ సురక్షితంగా భూమికి చేరింది. ఆదివారం రాత్రి 11.10 మెక్సికోలోని గ్వాడలుపే ద్వీపానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ క్యాప్యూల్ ల్యాండ్ అయింది. దాదాపు 26 రోజుల తర్వాత ఓరియన్ క్యాప్సూల్ భూమికి తిరిగి వచ్చింది.

NASA’s Orion Capsule : సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన నాసా ఓరియన్ క్యాప్సూల్.. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్

NASA's Orion capsule

NASA’s Orion capsule : అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ (నాసా) ఓరియన్ క్యాప్సూల్ సురక్షితంగా భూమికి చేరింది. ఆదివారం రాత్రి 11.10 మెక్సికోలోని గ్వాడలుపే ద్వీపానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ క్యాప్యూల్ ల్యాండ్ అయింది. దాదాపు 26 రోజుల తర్వాత ఓరియన్ క్యాప్సూల్ భూమికి తిరిగి వచ్చింది. నవంబర్ 15న నాసా మూన్ మిషన్ ఆర్టెమిస్-1ను ప్రారంభించింది. 53 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా మరోసారి సిద్ధమైంది.

ఆర్టెమిస్ మిషన్ ద్వారా ఈ మిషన్ ను మూడు భాగాలుగా విభజించారు. ఆర్టెమిస్-1, ఆర్టెమిస్-2, ఆర్టెమిస్ -3. వీటిలో మొదటి మిషన్ ఆర్టెమిస్-1 కింద కొన్ని చిన్న ఉపగ్రహాలు చంద్రుని చుట్టూ తిరుగుతూ విడుదల చేయబడ్డాయి. 26 రోజుల్లో ఈ మిషన్ ద్వారా చంద్రుడికి సంంధించిన ముఖ్యమైన ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఓరియన్ క్యాప్సూల్ భూమిపై ప్రత్యేకంగా ల్యాండ్ అయింది. తొలిసారిగా స్కిప్ ఎంట్రీ టెక్నిక్ తో ల్యాండింగ్ చేశారు.

Nasa Artemis1: మూన్ రాకెట్ ఆర్టెమిస్-1 నుంచి కనిపించిన భూమి.. అద్భుత వీడియోను విడుదల చేసిన నాసా

ఇందులో భాగంగా మొదట భూమి వాతారణంలోకి ప్రవేశించింది. అప్పుడు దాని క్యాప్సూల్ సాయంతో వాతావరణం వెలుపలికి వెళ్లింది. చివరకు అది పారాచూట్ ద్వారా మళ్లీ వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో వ్యోమనౌక, సిబ్బంది మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఒకదానికొకటి వేరు చేయబడ్డాయి. సర్వీస్ మాడ్యూల్ మంటల్లో మునిగిపోయింది. అయితే సిబ్బంది మాడ్యూల్ దాని నిర్ధేషిత ప్రదేశానికి పారాచూట్ చేసింది.

నాసా ఓరియన్ క్యాప్యూల్ మిషన్ ఆర్టెమిస్-1 విజయవంతం అయింది. 2024లో ఆర్టెమిస్-2 ప్రారంభించనున్నారు. అప్పుడు కొంత మంది వ్యోమగాములు కూడా వెళ్లనున్నారు.
వారు చంద్రుడిపై అడుగుపట్టనప్పటికీ దాని కక్ష్యలో సంచరించిన తర్వాత మాత్రమే తిరిగి వస్తుంది
ఈ మిషన్ వ్యవధి కూడా ఎక్కువే. ఈ మిషన్ విజయవంతం అయిన తర్వాత చివరి ఆర్టెమిస్-3 మిషన్ ను 2025 లేదా 2026లో ప్రారంభించనున్నారు. ఇందులో వెళ్లే వ్యోమగాములు చంద్రుడిపై కూడా దిగుతారు.

Nasa New Pictures: నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి మరో అద్భుత చిత్రం..

దీని కింద తొలిసారిగా మహిళలు కూడా మానవ చంద్ర మిషన్ లో భాగం కానున్నారు. ఈ మిషన్ కింద వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధృవంలో ఉన్న మంచు నీటిపై పరిధోనలు చేస్తారు. అయితే చంద్రుడిపైకి మనుషులను పంపడం అంత సులువైన విషయం కాదు. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ మేధోమథనంతోపాటు ఖర్చు కూడా లెక్కలేనంతగా అవుతుంది. ఈ మిషన్ చాలా ఖరీదైనది. నాసా 2025 నాటికి ఈ ప్రాజెక్టుకు 93 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.