Nasa Artemis1: మూన్ రాకెట్ ఆర్టెమిస్-1 నుంచి కనిపించిన భూమి.. అద్భుత వీడియోను విడుదల చేసిన నాసా

నాసా ప్రయెగించిన ఆర్టెమిస్-1 ఈనెల 21వరకు చంద్రుడి సమీపానికి చేరుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే.. ఈ రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికి భూమి యొక్క చిత్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాకెట్ చంద్రుడివైపు దూసుకెళ్తుండగా.. భూమి కిందికి వస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోను నాసా అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

Nasa Artemis1: మూన్ రాకెట్ ఆర్టెమిస్-1 నుంచి కనిపించిన భూమి.. అద్భుత వీడియోను విడుదల చేసిన నాసా

Artemis1

Nasa Artemis1: 2025 నాటికి చంద్రుడికి వ్యోమగాములను పంపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా తొలివిడతగా చంద్రుడిపైకి ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని చేపట్టింది. గత రెండుసార్లు సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడింది. కానీ, బుధవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్-1 మిషన్ విజయవంతంగా నాసా ప్రయోగించింది. దీంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు.

Nasa Artemis-1 Launch: నేడు చంద్రుడిపైకి అర్టెమిస్-1 ప్రయోగం.. ఈసారైనా నింగికెగురుతుందా..

నాసా ప్రయెగించిన ఆర్టెమిస్-1 ఈనెల 21వరకు చంద్రుడి సమీపానికి చేరుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే.. ఈ రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికి భూమి యొక్క చిత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టెమిస్-1 పైకి దూసుకెళ్తున్న సమయంలో భూమి గుండ్రంగా కిందికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను నాసా శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఈ వీడియోలో భూమి ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది.

నాసా ప్రకారం.. 2024 చివరి నాటికి, 2025 సంవత్సరం నాటికి వ్యోమగాముల బృందాన్ని చంద్రునిపైకి పంపించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలుత మానవరహిత ఆర్టెమిస్-1 రాకెట్ ను నాసా చంద్రుడిపైకి ప్రవేశించింది. ఈ మిషన్ విజయవంతమైతే.. చంద్రుడితో పాటు, అంగారక గ్రహం, ఇతర గ్రహాలకు కూడా వెళ్లేందుకు సులభం అవుతుందని నాసా భావిస్తుంది. ప్రస్తుతం ఆర్టెమిస్-1 ను నాసా శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.