cough and cold syrups
Cough Syrup Deaths: చిన్నారులకు ఇచ్చే దగ్గు మందు విషయంలో ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పలు సూచనలు చేసింది. భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్ బయోటెక్ ఉత్పత్తి చేసే రెండు దగ్గు సిరప్ లు వాడకూడదని ప్రతిపాదించింది. మారియన్ బయోటెక్ తయారు చేసే వైద్య ఉత్పత్తులు ఈ నాసిరకమని, నాణ్యతా ప్రమాణాలు లేవని డబ్ల్యూహెచ్‌వో తమ వెబ్ సైట్లో పేర్కొంది.
అంబ్రోనాల్ సిరప్, డాక్-1 మ్యాక్స్ సిరప్ వాడకూడదని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఉత్తరప్రదేశ్ నోడియాలోని మారియన్ బయోటెక్ సంస్థ ఆయా మందుల సురక్షిత, నాణ్యతకు సంబంధించిన హామీని తమకు ఇవ్వలేదని పేర్కొంది. ఆయా దగ్గు మందుల్లో ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు అధికంగా ఉందని చెప్పింది. ఆ రెండు దగ్గు మందుల వాడకం సురక్షితం కాదని, ముఖ్యంగా చిన్నారులు వాడకూడదని పేర్కొంది.
అవి వాడితే తీవ్ర అనారోగ్య సమస్యలు లేదా మరణం సంభవించవచ్చని తెలిపింది. కాగా, భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్ బయోటెక్ ఉత్పత్తి చేసిన దగ్గు మందు తీసుకున్న 18 మంది చిన్నారులు మృతి చెందారని గత ఏడాది డిసెంబరు 22న ఉజ్బెకిస్థాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఆహార భద్రత, ఔషధ పరిపాలనా విభాగం మారియన్ బయోటెక్ సంస్థ ఎటువంటి ఔషధాలనూ ఉత్పత్తి చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Dinosaur Species: 7.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసర్ల శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు