Dinosaur Species: 7.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసర్ల శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

దక్షిణ అమెరికాలోని చిలీలో తొలిసారి నాలుగు జాతులకు చెందిన డైనోసర్ల శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో మెగారాప్టర్ జాతికి చెందిన డైనోసర్ శిలాజం కూడా ఉంది. పటగోనియాలోని సెర్రోగైడోలో ఈ శిలాజాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. 2021లో ఆ శిలాజాలను ల్యాబొరేటరీకి తీసుకెళ్లామని, అవి నాలుగు జాతులకు చెందిన డైనోసర్ల శిలాజాలుగా తాజాగా నిర్ధారించుకున్నామని చెప్పారు.

Dinosaur Species: 7.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసర్ల శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

Dinosaur Species

Dinosaur Species: దక్షిణ అమెరికాలోని చిలీలో తొలిసారి నాలుగు జాతులకు చెందిన డైనోసర్ల శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో మెగారాప్టర్ జాతికి చెందిన డైనోసర్ శిలాజం కూడా ఉంది. పటగోనియాలోని సెర్రోగైడోలో ఈ శిలాజాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. 2021లో ఆ శిలాజాలను ల్యాబొరేటరీకి తీసుకెళ్లామని, అవి నాలుగు జాతులకు చెందిన డైనోసర్ల శిలాజాలుగా తాజాగా నిర్ధారించుకున్నామని చెప్పారు.

ఆ ప్రాంతంలో ఇంతకు ముందు ఎన్నడూ డైనోసర్ల శిలాజాలను గుర్తించలేదని చిలీయన్ అంటార్కిటిక్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మార్కెలొ లిప్పీ తెలిపారు. శిలాజాలను గుర్తించడానికి యూనివర్సిటీ ఆఫ్ చిలీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ తో కలిసి చిలీయన్ అంటార్కిటిక్ ఇన్‌స్టిట్యూట్ పనిచేసింది. నాలుగు జాతులకు చెందిన డైనోసర్ల పళ్లు, ఎముకలు వంటి వాటిని శాస్త్రవేత్తలు సేకరించారు.

ఆ డైనోసర్లు 6.6-7.5 కోట్ల సంవత్సరాల మధ్య జీవించేవని తేల్చారు. ఆ డైనోసర్లకు పొడవైన పంజాలు, తక్కువ పరిమాణంలో పళ్లు ఉండేవని యూనివర్సిటీ ఆఫ్ చిలీ ఓ ప్రకటనలో చెప్పింది. శాస్త్రవేత్తలు తమ అన్వేషణలో భాగంగా రెండు పక్షుల జాతుల శిలాజాలను కూడా గుర్తించారు.

అవి మెసోజోయిక్ యుగానికి చెందిన పక్షులని తేల్చామని చెప్పారు. కాగా, డైనోసర్ల శిలాజాలకు సంబంధించి ఇప్పటికే పరిశోధకులు ఎన్నో విషయాలను తేల్చారు. అవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉండేవని క్రమంగా అంతరించిపోయాయని ఇప్పటికే తేల్చారు.

CM KCR: నేడు మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల‎కు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇలా..