World Photography Day 2023: మేమూ ఫొటోగ్రాఫర్లమే అంటున్న ప్రముఖులు.. వారు స్వయంగా తీసిన ఫొటోలు చూస్తే..

పేరు తెచ్చుకున్న ఫొటో గ్రాఫర్లే కాదు క్రీడాకారుల నుంచి బిజినెస్‌మెన్ వరకు అందరూ తాము తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు.

World Photography Day 2023

World Photography Day 2023: ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరూ ఫొటోగ్రాఫర్లే అయిపోతున్నారు. చేతిలో ప్రత్యేకమైన కెమెరాలు ఉండే అవసరం లేదు. మొబైల్ ఫోన్ లో కెమెరా ఉంటే చాలు. ప్రకృతిలో తమకు కనపడిన అందాలను క్లిక్‌మనిపిస్తున్నారు. సెల్ఫీల నుంచి నదులు, కొండల ఫొటోల వరకు అన్నింటికీ మొబైల్ ఫోనే వాడుతున్నారు.

ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా పలువురు ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పలు ఫొటోలు పోస్ట్ చేశారు. తమ చేతులతో తీసిన ఫొటోలని చెప్పారు. తమలోనూ ఫొటోగ్రాఫర్ ఉన్నాడని అంటున్నారు.

పేరు తెచ్చుకున్న ఫొటో గ్రాఫర్లే కాదు క్రీడాకారుల నుంచి బిజినెస్‌మెన్ వరకు అందరూ తాము తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయి సహా పలువురు తీసిన ఫొటోలను చూడండి..