249మంది మెడికోల సస్పెన్షన్

స్టూడెంట్స్ హాజరుపై వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా పరీక్షలు రాసేందుకు నిరాకరిస్తూ సస్పెన్షన్ విధించింది. ద్వితీయ, తృతీయ ఏడాది చదువుతున్న 249 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. పరీక్షలు రాసేందుకు శుక్రవారం వారిని సస్పెండ్ చేశారు. దీంతో కేఎంసీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
మూడో సంవత్సరానికి చెందిన 176 మంది SCM సబ్జెక్టులో, రెండో సంవత్సరానికి చెందిన 15 మంది Pharmacologyలో, 18 మంది pathology, 40 మంది micro biology తరగతులకు సక్రమంగా హాజరుకాలేదు. 75 శాతం కంటే తక్కువ హాజరుశాతం ఉండటంతో పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవగా.. పోలీసులు వారిని శాంతింపజేసి సామరస్యంగా తేల్చుకోవాలంటూ సూచించారు.