సినిమా ప్రపంచం నుంచి పవన్ బయటకు రావాలి – మంత్రి బోత్స

  • Publish Date - September 7, 2019 / 08:23 AM IST

పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుండి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని అక్కడ వద్దు అని గతంలో పవన్ చెప్పలేదా ? మళ్లీ ఇప్పుడు అక్కడే రాజధాని అంటున్నారని..5 వేల ఎకరాలు మాత్రమే చాలు అనలేదా సూటిగా ప్రశ్నించారాయన. రాజధాని అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బోత్స స్పందించారు. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడారు. రాజధాని, ఇతర అంశాలపై టీడీపీ చేస్తున్న విమర్శలను ఖండించారు. 

మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నా..మంత్రిగా ఎలా ఉండాలో కొత్త నిర్వచనాలు పవన్‌కి తెలిస్తే చెప్పాలంటూ సూచించారు. నాయకుడంటే ఎలా ఉండాలో 100 రోజుల్లో సీఎం జగన్ చూపించారని, బాబు ఐదేళ్లలో చెయ్యలేనివి జగన్ వంద రోజుల్లో చేశారని చెప్పారు. అయితే..బాబు కడుపు మంటతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఇన్ని రోజుల పాలన సాగిందన్నారు.

టీడీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తమ విధానంలోనే పాలన సాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా అని మంత్రి బోత్స సూటిగా ప్రశ్నించారు. తాత్కాలిక రాజధానిగానే బాబు సూచించారని, అవినీతిని అరికట్టేందుకు రివర్స్ టెండరింగ్ వెళ్లడం తప్పా అన్నారు. గతంలో మీ పరిపాలన విధానం ఇదేనా అంటూ బాబును నిలదీశారు. ఈ రాష్ట్రానికి చిరునామా లేకుండా చేసింది మీరు కాదా ? పెట్టుబడి దారులు ఎక్కడకు వెళ్లిపోరని భరోసా ఇచ్చారు.  40 ఏళ్ల అనుభవం ఉందన్న చంద్రబాబు ఏపీకి ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రతి విషయాన్ని టీడీపీ రాద్ధాంతం చేస్తోందన్నారు ఏపీ మంత్రి బోత్స. 
Read More : జగన్ 100 రోజుల పాలన : అభివృద్ధి నిల్..సంక్షేమం డల్ – లోకేష్