జగన్ సభలో కూలిన ఇంటి స్లాబ్ : 30 మందికి గాయాలు

జగన్ సభలో అపశృతి. ఇంటి స్లాబ్ కూలి 30 మంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఈ ఘటన జరిగింది. మండపేట సెంటర్ లో ఎన్నికల సభ ఏర్పాటు చేశారు జగన్.. భారీ ఎత్తున జనం వచ్చారు. చుట్టూ ఉన్న బిల్డింగులపైకి పెద్ద ఎత్తున చేరారు ప్రజలు. ఈ సమయంలోనే.. ఓ ఇంటి స్లాబ్ కూలిపోయింది. దానిపై ఉన్న 20 మంది కిందపడ్డారు. కింద ఉన్న 10 మంది గాయపడ్డారు. మొత్తం 30 మంది ఈ యాక్సిడెంట్ లో గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.

జగన్ సభలో అపశృతి అనే వార్త కలకలం రేపింది. జగన్ ఏర్పాటు చేసే ప్రతి సభ ఊరి మధ్యలో ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు బిల్డింగ్స్, టవర్లు, చెట్లు ఎక్కుతుంటారు ప్రజలు. నిర్వహకులు కూడా ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది.
Read Also : పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేస్తే వచ్చేది టీడీపీ కార్యకర్తలే