సీఎం చంద్రబాబే.. పవర్ మాత్రం లేదు : సీఎస్ వ్యాఖ్యల కలకలం

సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రే అని.. అయితే అధికారాలు మాత్రం ఉండవని స్పష్టం చేశారాయన. 

జగన్ గెలిస్తే 24నే ప్రమాణం చేసుకోవచ్చు.. బాబు అయితే ఎప్పుడంటే అప్పుడే ఏపీలో పరిపాలనపై సమీక్షలకు సంబంధించి పరిపాలన పర్యవేక్షణ అంతా ఈసీ-సీఎస్ పరిధిలోనే ఉంటుందన్నారు. ఫలితాలు వెల్లడయ్యే మే 23వ తేదీ వరకు పార్టీ అధినేతలు వేచి చూడాలన్నారు.
Also Read : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడరు

రిజల్ట్స్ వచ్చిన తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గెలిస్తే.. మే 24వ తేదీనే సీఎం ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు.. అదే టీడీపీ గెలిస్తే చంద్రబాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించవచ్చు అన్నారు. 

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి అధికారాలు ఉంటాయి అనేది స్పష్టంగా ఉన్నాయని.. వాటిని ఆయా వ్యక్తులకు కూడా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఎవరి పరిధిలో వాళ్లు పని చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. టెక్నికల్ గా చూస్తే చంద్రబాబు సీఎం అయినా.. కేర్ టేకర్ కాదన్నారు. చంద్రబాబు సీఎంగానే ఉన్నా.. పవర్ మాత్రం ఉండదన్నారు. మే 23వ తేదీ వరకు ఆయన ఆఫీసు నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయటానికి ఉండదన్నారు. మే 23వ తేదీ తర్వాత ఎవరు గెలిస్తే వాళ్లు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చని సూచించారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.
Also Read : తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదు

ట్రెండింగ్ వార్తలు