Queen Elizabeth II Death: బ్రిటన్ వ్యాప్తంగా అన్ని చర్చుల్లో మోగిన గంటలు.. సెప్టెంబరు 19న అంత్యక్రియలు

 బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II మృతి చెందడంతో ఇవాళ బ్రిటన్ వ్యాప్తంగా అన్ని చర్చుల్లో గంటలు మోగించారు. బ్రిటన్ రాణి మరణంతో గౌరవ సూచకంగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఎలిజబెత్‌-II మరణించినట్లు నిన్న అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజకుటుంబ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు. పది రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. రాణి మృతి చెందిన 10 రోజుల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి.

Queen Elizabeth II Death: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II మృతి చెందడంతో ఇవాళ బ్రిటన్ వ్యాప్తంగా అన్ని చర్చుల్లో గంటలు మోగించారు. బ్రిటన్ రాణి మరణంతో గౌరవ సూచకంగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఎలిజబెత్‌-II మరణించినట్లు నిన్న అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజకుటుంబ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు. పది రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు.

రాణి మృతి చెందిన 10 రోజుల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. రాణి పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచుతారు. ఎలిజబెత్‌-II కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ 10 రోజుల పాటు బ్రిటన్ పర్యటన చేసి, దేశ ప్రజలను ఆయన కలుస్తారు. సెయింట్‌ పాల్‌ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రిన్స్‌ ఛార్లెస్‌ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది.

బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో ఆయన కొనసాగే అవకాశం ఉంది. బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్దకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చి గేట్ల వద్ద పుష్పాలు ఉంచి నివాళులు అర్పిస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II అంత్యక్రియలు వెస్ట్‌మిన్‌స్టర్ అబేలో సెప్టెంబరు 19న నిర్వహించే అవకాశం ఉంది.

Hyderabad Metro: నేడు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు మెట్రో రైళ్ల సేవలు

ట్రెండింగ్ వార్తలు