”నేను లంచం తీసుకోను” అని బోర్డు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగికి ఊహించని షాక్
ఈ రోజుల్లో మంచి చేస్తున్నా.. విలువలు పాటిస్తున్నా.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నా.. కొందరికి నచ్చదు.. వారు చెయ్యరు చేసేవాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇటీవల ఎమ్మార్వో

ఈ రోజుల్లో మంచి చేస్తున్నా.. విలువలు పాటిస్తున్నా.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నా.. కొందరికి నచ్చదు.. వారు చెయ్యరు చేసేవాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇటీవల ఎమ్మార్వో
ఈ రోజుల్లో మంచి చేస్తున్నా.. విలువలు పాటిస్తున్నా.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నా.. కొందరికి నచ్చదు.. వారు చెయ్యరు చేసేవాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇటీవల ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ ఆఫీసుల్లో పని జరగదంటూ సోషల్ మీడియాలో ఉద్యోగులు, అధికారులపై జనం సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ”నేను లంచం తీసుకోను” అంటూ.. కరీంనగర్ విద్యుత్ శాఖలో సర్కిల్ కార్యాలయంలో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ పెట్టిన బోర్డు హాట్ టాపిక్ గా మారింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అశోక్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఇలా ఉండాలంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. సహ ఉద్యోగుల నుంచి మాత్రం అశోక్ కు చేదు అనుభవం ఎదురవుతోంది. ”నేను లంచం తీసుకోను” అని బోర్డు పెడితే… ”మేము తీసుకుంటున్నామని అర్ధమా. నువ్వు ఒక్కడివే నిజాయితీ పరుడువి మేము లంచగొండులమా” అంటూ సూటి పోటి మాటలు అంటున్నారట.. వాట్సాప్ లో మెస్సేజ్ లు చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారట. దీంతో అశోక్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఓ మంచిపనికి ముందడుగు వేస్తే.. సహ ఉద్యోగుల నుంచే ఇబ్బందులు రావడాన్ని అశోక్ తట్టుకోలేకపోతున్నారు.
పై అధికారులు చెప్పినా .. పద్ధతి ప్రకారమే పని జరగాలనుకునే తత్వం అశోక్ ది.. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నిజాయితీగా పని చేయాలనుకున్నారు. అయితే కొందరు సహ ఉద్యోగులకు తన వ్యవహారం నచ్చలేదని అశోక్ చెబుతున్నారు. సూటి పోటి మాటలతో తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. నిజాయితీగా పని చేస్తా.. లంచం తీసుకోను అని చెబుతున్న అశోక్ ను సహ ఉద్యోగులే వేధిస్తున్నారంటే.. వాళ్లు ఎలాంటి ఉద్యోగులో అర్ధం చేసుకోవచ్చు.. ఏది ఏమైనా నేటి సమాజానికి అశోక్ లాంటి ఉద్యోగులు ఎంతైనా అవసరం.. మరి అశోక్ ను ఉన్నతాధికారులు అభినందిస్తారో.. లేదో చూడాలి.