విజయవాడ దుర్గ గుడిలో ఏరోజు ఏ అలంకారం

  • Publish Date - September 28, 2019 / 12:13 PM IST

ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి, ఆదివారం, సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబయ్యింది. భక్తుల సౌకర్యార్ధం దేవస్దానం, రెవెన్యూ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.  కొండపై  వెలసిన దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణకవచలాంకృత దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.  

ఆశ్వయుజ శుధ్ద సప్తమి, మూలా నక్షత్రం, శనివారం, అక్టోబరు 5వ తేదీ అమ్మవారు  సరస్వతి దేవీ అలంకారంలో దర్శనమిచ్చి భక్తలను అనుగ్రహించనున్నారు.  

ఆశ్వయుజ శుధ్ధ దశమి  మంగళవారం విజయదశమిరోజు రాజరాజేశ్వరీ దేవి అలంకారం లో అమ్మావారు కనువిందు చేయనున్నారు. అదే రోజు సాయంత్రం హంస వాహనంపై కృష్ణ నదిలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 
 

 

ట్రెండింగ్ వార్తలు