బ్రేకింగ్ : కృష్ణానదిలో బోటులో మంటలు

విజయవాడ: కృష్ణానదిలో ఉంచిన బోట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన స్థానికులు కేకలు వేయడంతో.. బోటు

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 11:28 AM IST
బ్రేకింగ్ : కృష్ణానదిలో బోటులో మంటలు

Updated On : January 28, 2019 / 11:28 AM IST

విజయవాడ: కృష్ణానదిలో ఉంచిన బోట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన స్థానికులు కేకలు వేయడంతో.. బోటు

విజయవాడ: కృష్ణానదిలో ఉంచిన బోట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన స్థానికులు కేకలు వేయడంతో.. బోటు నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. వెంటనే మంటలను అదుపులోనికి తెచ్చారు. రైడింగ్‌కు అనుమతి లేకపోవడంతో బోటుని తాడేపల్లి దగ్గర జెట్టికి కట్టి ఉంచారు. ప్రమాదానికి గురైన బోటు ఛాంపియన్స్ యాచ్ క్లబ్ సంస్థకి చెందిన క్రూయిజ్ బోటు. ప్రమాదానికి గల కారణాలను టూరిజం శాఖ అధికారులు తెలుసుకునే పనిలో పడ్డారు.

 

బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడ్డారు. కాగా, ఇది ఆకతాయిల పని అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.