యూజ్ లెస్ ఫెలో అంటూ పోలీసులను తిట్టిన అచ్చెన్నాయుడు

  • Published By: veegamteam ,Published On : September 11, 2019 / 05:39 AM IST
యూజ్ లెస్ ఫెలో అంటూ పోలీసులను తిట్టిన అచ్చెన్నాయుడు

Updated On : September 11, 2019 / 5:39 AM IST

గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు సభను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తోంది. దీంట్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు నివాసానికి వెళుతున్న అచ్చెన్నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడు వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఎస్పీ విక్రాంత్ పటేల్ ను యూజ్ లెస్ ఫెలో అంటూ దూషించారు. 

టీడీపీ చలో ఆత్మకూరు పిలుపు మేరకు పోలీసులు పలు ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతల్ని ఎక్కడక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని టీడీపీ నేతల తీవ్రంగా ఖండిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబుని కూడా ఆత్మకూరు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు అమరావతిలోని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు.  అచ్చెన్నాయుడు చంద్రబాబు నివాసానికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై అచ్చెన్నాయుడు చిందులేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ..విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా తిట్టారు. 

గుంటూరు జిల్లా పల్నాడులో ఉద్రిక్త పరిస్థితి రీత్యా 144 సెక్షన్ అమలులో ఉన్నందున లోపలికి ఎవ్వరినీ అనుమతించటంలేదనీ..అందుకే  అడ్డుకోవాల్సి వచ్చిందనీ ఎస్పీ విక్రాంత్  పటేల్ అచ్చెన్నాయుడికి సర్థి చెప్పే యత్నం చేశారు. అయినా ఊరుకోని అచ్చెన్నాయుడ..ఏయ్..ఎక్స్ ట్రాలు చేయొద్దు..నన్ను ఆపే అధికారం మీకెవరిచ్చారంటూ రెచ్చిపోయారు. పోలీసులు ఆపినా ఆగకుండా ముందుకు వెళ్తున్న ఆయన్ని ఎస్పీ ఆపారు.

ఈ క్రమంలో అచ్చెన్న..విక్రాంత్ గారూ..నేను చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్తునా..శాంతియుతంగా ఉన్న మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు..ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మంత్రిగా కూడా పనిచేశానుమీరు చిన్నవిషయాన్ని కూడా పెద్దది చేస్తున్నారు. ఇది సరైంది కాదు అంటూ దిగివచ్చారు. ఇక్కడే కూర్చుంటాం ముందుకు వెళ్లం అని చెప్పినా ఎస్పీ మాత్రం ఇక్కడ కూడా కూర్చునేందుకు వీల్లేదన్నారు. అయినా వారు అక్కడి నుంచి వెళ్లకపోవటంతో అచ్చెన్నాయుడితో పాటు నన్నపనేని రాజకుమారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.